తెలుగులో ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వం వహించిన “వరుడు” అనే చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించి తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ “దీక్షా పంత్” గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు తాను నటించినటువంటి చిత్రాలతో కంటే ఎక్కువగా బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అంతేగాక పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలను కూడా దక్కించుకుంది.
అయితే ఇప్పటివరకు దీక్షా పంత్ దాదాపుగా పదికి పైగా చిత్రాలలో నటించింది కానీ ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం ఫ్లాప్ అవ్వడం మరియు మరి కొన్ని చిత్రాలలో ఈ అమ్మడి పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
అయినప్పటికీ దీక్షా పంత్ పట్టు విడవకుండా సినిమా అవకాశాల కోసం బాగానే ప్రయత్నాలు చేస్తోంది.
కానీ ఇప్పటి వరకు ఈ అమ్మడికి తన నటనా ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో హీరోయిన్ గా తన ఉనికిని చాటుకునేందుకు బాగానే శ్రమిస్తోంది.
మరోవైపు తన అందమైన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ రోజురోజుకీ తన ఫాలోవర్స్ సంఖ్య కూడా పెంచుకుంటోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా దీక్షా పంత్ ప్రస్తుతం తెలుగులో డాక్టర్ ఆనంద్ ఇస్లావత్ దర్శకత్వం వహిస్తున్న హార్మోన్స్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు ఎప్పుడో పూర్తయినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదు.అలాగే హిందీలో అయామ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.







