అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచం మొత్తం కళ్ళప్పగించి ఎదురు చూసింది.ఎట్టకేలకు ఎన్నికలు వచ్చేశాయి, ఓటింగ్ అయ్యిపోయింది,ఓట్ల లెక్కింపులో అమెరికా ప్రజల అనుగ్రహాన్ని సాధించిన విషయంలో బిడెన్ విజయం సాధించాడు.
ఇక అమెరికా అధ్యక్షుడు ఎవరనేది ప్రకటించడం లాంచానమే.అయితే తన కు అన్యాయం జరిగిందని తూచ్ అంటూ ట్రంప్ కోర్టుకు ఎక్కేందుకు సర్వం సిద్దం చేసుకున్నాడు.
ఇక్కడి వరకూ బాగానే ఉన్నా మరొక ప్రశ్న అమెరికా ప్రజలను మాత్రం ఆలోచనలో పడేసింది.
అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ ను ప్రకటిస్తే ఇప్పటికే కౌంటింగ్ విషయంలో గగ్గోలు పెడుతున్న ట్రంప్ అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేస్తాడా లేదా అనే అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
ఒక వేళ ట్రంప్ శ్వేత సౌధం ఖాళీ చేయకపోతే ఏమి చేయాలనే అంశంపై బిడెన్ వర్గం కసరత్తులు చేస్తోంది.ఈ విషయంపై అమెరికా మీడియా కూడా ఆసక్తికరమైన కధనాలను ప్రచురించింది అదేంటంటే.
ఓడిన అధ్యక్షుడు ఒక వేళ వైట్ హౌస్ ఖాళీ చేయనని పట్టుబడితే క్రొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు అక్కడి సీక్రెట్ ఏజెన్సీల ద్వారా బయటకి పంపచ్చునని తెలిపింది…
ట్రంప్ ఒకవేళ ఎంతకూ మాట వినకపోతే సీక్రెట్ ఏజెన్సీలు అక్కడి నుంచీ ట్రంప్ ను తీసుకెళ్తారని తెలిపింది.ట్రంప్ అధ్యక్ష హోదాలో ఉండరు కాబట్టి, ట్రంప్ ను బయటకి పంపే పూర్తి హక్కులు వారికి ఉంటాయని ప్రచురించింది.
ఇదిలాఉంటే ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్ధి వైట్ హౌస్ ఖాళీ చేయకపోతే అతడిని చట్టబద్దంగా తొలగించే అవకాశం లేదని అమెరికా రాజ్యాంగంలో అలాంటి నిభంధనలు ఎక్కడా లేవని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.ట్రంప్ ఈ లొసుగులను చూపించి వైట్ హౌస్ ఖాళీ చేయకుండా భీష్మించుకుని కూర్చుంటే పరిస్థితులు ఆందోళన కరంగా మారే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు.