పెళ్లి తర్వాత రానా జీవితం అలా ఉందంట!

రానా ద‌గ్గుబాటి.! బాహుబలి చిత్రంతో భల్లాలదేవుడిగా ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ ప్రియుల అభిమానుల్ని చోర‌గొన్నారు ఈ ద‌గ్గుబాటి వారబ్బాయి.2010లో లీడ‌ర్ సినిమాతో హీరోగా సిల్వ‌ర్ స్క్రీన్ లో అడుగుపెట్టి త‌న న‌ట వార‌స‌త్వాన్వి అందిపుచ్చుకున్నారు.ఇలా అన్నీ భాష‌ల్లో క‌లుపుకొని మొత్తం 20సినిమాల్లో యాక్ట్ చేశారు.

 Rana Daggubati Shares Life After Marriage , No Filter With Neha, Rana Daggubati,-TeluguStop.com

వీటిలో కృష్ణం వందే జగద్గురు, బాహుబ‌లి, నేనే రాజు నేనే మంత్రి, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు లాంటి సినిమాలు విమ‌ర్శ‌కులు సైతం ప్రశంసించేలా అవార్డ్ ల‌ను కొల్ల‌గొట్టాయి.లీడ‌ర్ కు ఫిల్మిం ఫేర్, కృష్ణం వందే జగద్గురు కు సైమా అవార్డ్ ల‌ను దక్కింది.

ఇదంతా ఒకెత్తైతే స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా 70 సినిమాలకు పైగా విజువుల్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ లు చేశారు.
ఇలా ప్రొడ్యూస‌ర్ గా, బిజినెస్ మ్యాన్ గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా, హీరోగా త‌న యాక్టింగ్ తో స్టార్ డ‌మ్ సంపాదించిన రానా.

, ప్ర‌స్తుతం హిర‌ణ్య క‌శ‌ప్, విరాట ప‌ర్వం సినిమాలు చేస్తున్నారు.క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోవ‌డంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి మోస్ట్ ఫ్యామిలీ ప‌ర్స‌న్ గా మారాడు రానా.

లాక్ డౌన్ స‌మ‌యంలో త‌న ప్రియురాలు మిహీక‌ను ప్రేమ వివాహం చేసుకున్న రానా నోఫిల్ట‌ర్ విత్ నేహా అనే షోలో త‌న ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆస‌క్తి విష‌యాలు చెప్పాడు.చిన్న‌త‌నంలో త‌ను, త‌న సోద‌రి స్కూల్ కి వెళ్లే స‌మ‌యంలో మిహీకా ప‌రిచ‌య‌మైంది.

స్వ‌త‌హాగా హైద‌రాబాద్ అయిన మిహీకా కుటుంబం వ్యాపార రిత్య బొంబాయికి వెళ్లిన‌ట్లు చెప్పిన రానా.మిహీకా ప‌రిచయం పెళ్లిగా మారింద‌న్నారు.అంద‌రూ అనుకుంటారు పెళ్లి త‌రువాత జీవితాలు పూర్తిగా మారుతాయ‌ని, ఆ విష‌యాన్ని నేను అంగీక‌రించ‌ను.కాక‌పోతే స్థిరంగా ఉన్నాను.

చాలా స‌ర‌దాగా ఉండే త‌న భార్య మిహీక‌తో క‌రోనా వ‌ల్ల ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నానంటూ త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల్ని షేర్ చేశాడు బ‌ల్లాల దేవ‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube