ఇదే ఊపు కొన‌సాగితే.. లోకేష్‌కు తిరుగులేదా..?

ఏమాట‌కామాటే చెప్పుకోవాలి. టీడీపీలో ఒక‌ప్పుడు ప‌ప్పు అని అనిపించుకున్న మాజీ మంత్రి నారా లోకేష్ పుంజుకున్నారు.

తాజాగా ఆయ‌నకు సంబంధించి.ఓ వెబ్ ఛానెల్ చేసిన స‌ర్వేలో.

మంచి మార్కులే ప‌డ్డాయి.ఆయ‌న‌కు త‌న తండ్రి మాజీ సీఎం చంద్ర‌బాబు చెప్పారో లేక‌.

త‌నంత‌ట తానే ఇనిషియేట్ తీసుకుని రంగంలోకి దిగారో తెలియ‌దు కానీ.ఇటీవ‌ల వ‌రద ప్ర‌భావిత జిల్లాల్లో ప‌ర్య‌టించారు.

Advertisement

ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌తో పాటు గుంటూరు, అనంత‌పురం జిల్లాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు.ఈ క్ర‌మంలో ఆయ‌న ఏకంగా న‌డుంలోతు వ‌ర‌ద నీటిలో కూడా దిగిపోయి.

బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.నిజానికి.

టీడీపీ అధికారంలో ఉన్న‌స‌మ‌యంలో నీటిని చూసి లోకేష్ జంకేవారు.ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయంటూ.

గ‌ట్టునే ఉండి బాధితుల‌ను ప‌రామ‌ర్శించేవారు.అయినా.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆయ‌న అప్ప‌ట్లో ఎంచుకున్న కొన్ని ప్రాంతాల్లోనే తిరిగిన సంద‌ర్భాలు ఉన్నాయి.ఎక్కువ‌గా అప్ప‌ట్లో సీఎం చంద్ర‌బాబు క‌లియ‌దిరిగేవారు.

Advertisement

ఆయ‌న కూడా హెలీకాప్ట‌ర్ ద్వారానో.లేక వ‌ర‌ద త‌గ్గిన త‌ర్వాతో.

వెళ్లి ప‌రామర్శించేవారు.కానీ, దీనికి భిన్నంగా లోకేష్ ఇప్పుడు వేసిన అడుగులకు ప్ర‌జ‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

నిజానికి ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత దాదాపు లోకేష్‌.హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యారు.

అసెంబ్లీ స‌మావేశాలు లేదా మండ‌లి స‌మావేశాలు ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఆయ‌న క‌నిపించేవారు.ఆ స‌మ‌యంలో కొంత హ‌డావుడి చేసేవారు.

అయితే, అప్ప‌ట్లో ఎంత చేసినా.మొత్తం క్రెడిట్ అంతా కూడా చంద్ర‌బాబు ఖాతాలో ప‌డిపోయేది.

లేదా మిగిలిన నేత‌ల‌తో క‌లిపి లోకేష్‌కు ఆ క్రెడిట్ ద‌క్కేది.కానీ.

ఇప్పుడు మాత్రం వ్య‌క్తిగ‌తంగా లోకేష్ చూపించిన దూకుడు, వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌ల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించిన తీరుకు మంచి మార్కులే ప‌డుతున్నాయి.ఇదే దూకుడు మ‌రో మూడేళ్లు కొన‌సాగిస్తే.

ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు ఖాయ‌మంటూ.టీడీపీ సానుభూతి ప‌రుల‌తో పాటు.

త‌ట‌స్థంగా ఉండే మేధావులు కూడా సూచిస్తుండ‌డం గ‌మ‌నార్హం.అదే స‌మ‌యంలో ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కూడా పార్టీ కేడ‌ర్‌ను స‌మాయత్తం చేయాల్సిన అవ‌స‌రం కూడా ఉంది.

తాజా వార్తలు