హైదరాబాద్ వరద బాధితులకు అండగా ప్రభాస్.. ఎంత ఇచ్చాడు అంటే?

హైదరాబాద్ ను కరోనా వైరస్ ఎంత దారుణంగా మార్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అలాంటి కరోనా వైరస్ కే ప్రజలు అంత అల్లాడిపోతున్న సమయంలో వర్షాలు వచ్చాయ్.

వచ్చిన వర్షాలు వచ్చినట్టు ఉండకుండా దారుణంగా మార్చేశాయి.వర్షాలు కాస్త వరదలుగా మారి హైదరాబాద్ ప్రజలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్నాయ్.

ఇక ఇలా గత వారం రోజుల నుంచి వర్షాలు పడి ప్రజలంతా వరదనీటిలో అల్లాడిపోతున్న సమయంలో టాలీవుడ్ హీరోలు అంత ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.కరోనా వైరస్ సమయంలోనే సినీ హీరోలు అంత వారికీ తోచినంత సహాయం చెయ్యగా ఇప్పుడు మరోమారు వరద బాధితులకు సహాయం చేస్తున్నారు.

నాగార్జున వరద బాధితులకు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు ఇవ్వడం ప్రారంభించగా ఒకొక్కరు వారి వెనుక వచ్చి సహాయం చేస్తున్నారు.ఇప్పటికే మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండలు విరాళం ఇవ్వగా తాజాగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ కూడా విరాళం ఇచ్చారు.

Advertisement

వరదలకు గురైన ప్రజలకు అండగా ఉంటూ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఏకంగా కోటి 50 లక్షల రూపాయిలు విరాళం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు.ఇక అలానే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటూ సీఎం రిలీఫ్ ఫండ్ కోటి రూపాయిలు విరాళం ఇచ్చారు.అంతేకాదు తెలంగాణ ప్రజలకు సహాయంగా ఉండేందుకు జనసైనికులను కూడా పిలిచారు పవన్ కళ్యాణ్.

కాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కొన్ని క్షణాల క్రితమే విడుదలైంది.ఏది ఏమైనా తెలుగు హీరోలు అంటే ఆ మాత్రం ఉంటది మరి.

Advertisement

తాజా వార్తలు