నటకిరీటి, డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు గారికి కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఎంతో ప్రత్యేకం.సినిమా ఇండస్ట్రీలో లక్ష్మీప్రసన్నకు మంచి గుర్తింపే ఉంది.
లక్ష్మీ ప్రసన్న తన ప్రత్యేకమైన మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంది.గత వారం లక్ష్మీ ప్రసన్న తన 43వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి అందరికీ తెలిసినదే.
ఈమె పుట్టిన రోజు కానుకగా మోహన్ బాబు తనదైన శైలిలో తన కూతురిని ఒక మాణిక్యం లాగా భావించి ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అందరినీ ఆకట్టుకుంది.
తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి లక్ష్మీ మంచు గోవా కి వెళ్ళింది.
గోవాకి తనతో పాటు తన కూతురు విద్యా నిర్వాణ ను కూడా వెంట తీసుకెళ్ళింది.అయితే కరోనా నేపథ్యంలో ఎక్కడ ఏ వస్తువులు తాకితే కరోనా వస్తుందనే భయంతో ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయింది.
తనతో పాటు తన కూతురు ఉండటంవల్ల గోవా టూర్ తనకు చాలా భయం వేసింది అని లక్ష్మీ మంచు పేర్కొన్నారు.
గోవాలో తన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు తన స్నేహితులు తన వెంట ఉండడం, ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది అన్నారు.
కరోనా రాకముందు నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తూ జరుపుకునే వారని, ప్రస్తుతం కరోనా వల్ల కేవలం కొద్దిమంది స్నేహితుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నానని తెలిపారు.ట్రావెల్ చేసే సమయం నుంచి ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ, నిర్వణ ఏ వస్తువును తాకకుండా ఎంతో జాగ్రత్త తీసుకుంటూ ప్రయాణం చేయడం వల్ల, ఎంతో కష్టంగా అనిపించిందని, అయితే ఒక్కసారి గోవా బీచ్ లోకి అడుగుపెట్టే సమయానికి ఆనందం రెట్టింపు అయిందని, తన కూతురు ఈ టూర్ ను ఎంతో బాగా ఎంజాయ్ చేసిందని తెలిపారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రియా చక్రవర్తిని సపోర్ట్ చేస్తూ పెట్టిన పోస్ట్ చూస్తూ కొంతమంది నెగిటివ్ కామెంట్ చేశారని ఆమె పేర్కొన్నారు.ఇలాంటి కొంత మందిని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఎవరూ మార్చలేరని, అలాంటి వాళ్ళను బ్లాక్ చేయడం ఒక్కటే ఉత్తమమైన మార్గమని లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు.







