టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ఒకటైన ‘వకీల్ సాబ్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో ‘వకీల్ సాబ్’గా రీమేక్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తనదైన శైలిలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తయ్యిందని, కేవలం కొన్ని రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే పవన్ 20 రోజుల డేట్స్ ఇచ్చాడు.దీంతో ఈ సినిమా టీజర్‌ను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సోషల్ థ్రిల్లర్ మూవీలో నివేదా థామస్, అంజలి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, శృతి హాసన్ ఓ కేమియో పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరి ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.ఏదేమైనా పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ విషయంలో స్పీడు పెంచాలని చూస్తుండటంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేయాలని చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.