ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ అసలు జరుగుతుందో జరగదో అన్న పరిస్థితుల నుంచి అనేక అవరోధాలను దాటుకొని యూఏఈ ఈ దేశంలో ప్రేక్షకులు లేకుండానే ఈసారి సీజన్ మొదలైపోయింది.ఆటగాళ్ల భద్రత దృశ్య నేపథ్యంలో అనేక కఠిన నిబంధనలు పాటిస్తూ ఈ టోర్నీని ముందుకు సాగిస్తున్నారు.
ఇన్ని రోజులు సజావుగానే నడుస్తున్నా తాజాగా ఫిక్సింగ్ ప్రకంపనలు మొదలయ్యాయి.బుకీలు వారి ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ ఆటగాళ్లను సంప్రదిస్తున్నారు అన్న వార్తలు వినపడుతున్నాయి.
అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే….
కొందరు బుకీలు సోషల్ మీడియా మార్గంగా చేసుకొని ఆటగాళ్లను బుకీలు కాంటాక్ట్ అయ్యారని సమాచారం.
ఇలా జరిగిన నేపథ్యంలో ఓ జట్టు ఆటగాడు తనకు ఎదురైనా సంఘటనల నేపథ్యంలో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేయడంతో వెంటనే బీసీసీఐ అధికారులు ఈ విషయంపై అప్రమత్తమయ్యారు.ఈ విషయాన్ని ధృవీకరించిన బీసీసీఐ వెంటనే అవినీతి నిరోధక విభాగం తరపున విచారణ కొనసాగింపుకు రంగం సిద్ధం చేసింది.
అయితే ప్రోటోకాల్ నేపథ్యంలో భాగంగా సమాచారం తెలిపిన క్రికెటర్ ఎవరు అన్న విషయం తాము వెల్లడించలేదని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ తెలియజేశారు.ప్రస్తుతానికి ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి వివరాలు ఇవ్వలేమని, ప్రస్తుతం దుబాయ్ లో సీజన్ నడుస్తున్న నేపథ్యంలో కొన్ని భద్రతా చర్యల నేపథ్యంలో పూర్తి విచారణ చేపట్టిన తర్వాత వివరాలు తెలియజేస్తామని తెలిపారు.
యూఏఈ లో ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్ల కంటే ముందే బుకీలు అక్కడికి చేరుకొని ఆటగాళ్ళతో బుకీలు సంప్రదింపులు చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.అయితే బిసిసిఐ ఆటగాళ్లను పూర్తిగా బయో సెక్యులర్ వాతావరణంలోని ఉంచడంతో బుకీలకు ఆటగాళ్లను కలవడం పెద్ద కష్టమైపోయింది.
దీంతో వారు సామాజిక వెబ్ సైట్స్ ను మార్గంగా ఆటగాళ్లను సంప్రదించడం మొదలుపెట్టారు.దీంతో ప్రస్తుతం ఆటగాళ్లు సోషల్ మీడియా ఖాతాల పై ప్రత్యేక నిఘా ఉంచినట్లు బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ తెలియజేశారు.