తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్ సినిమాలకు గుడ్ బై చెబుతోంది.కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులతో సతమతమైనా ఆ తరువాత వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
అందం, అభినయం ఉన్న నటి కావడంతో శృతి హాసన్ కు వరుసగా ఆఫర్లు వచ్చాయి.
ఒక దశలో శృతి హాసన్ టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ అనిపించుకున్నా ఆ స్థానాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోవడంలో మాత్రం ఫెయిలైంది.
కాటమరాయుడు సినిమా ఫ్లాప్ తరువాత టాలీవుడ్ సినిమాలకు కొంత దూరంగా ఉన్న శృతి హాసన్ బలుపు సినిమా తరువాత రవితేజతో మరోసారి కలిసి క్రాక్ సినిమాలో నటిస్తోంది.డ్రామా థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2021 లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇకపోతే శృతి హాసన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని తెలుస్తోంది.శృతి హాసన్ తనకు నచ్చిన పాత్రలు రావడం, దర్శకులు రొటీన్ కథలే వినిపిస్తున్నారని అందువల్లే సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండబోతుందని సమాచారం.
ప్రస్తుతం ఉన్న సినిమాల షూటింగ్ లు పూర్తైన తరువాత శృతి లాంగ్ గ్యాప్ తీసుకోనుంది.సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ వెబ్ సిరీస్ ల ద్వారా అభిమానులను పలకరించనుంది.
ప్రస్తుతం శృతి నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న లస్ట్ స్టోరీస్ లో నటించనుందని సమాచారం.బాలీవుడ్ లో నలుగురు దర్శకులు తెరకెక్కించిన లస్ట్ స్టోరీస్ ను తెలుగులో కూడా నలుగురు దర్శకులు తెరకెక్కించనున్నారు.
శృతిహాసన్ నటించనున్న భాగానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తారు.మరోవైపు శృతికి గతంతో పోలిస్తే అవకాశాలు తగ్గడం కూడా సినిమాలకు గుడ్ బై చెప్పడానికి కారణం అని తెలుస్తోంది.