మన ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నప్పుడు చాలా కంగారు పడతాము.ఆ ఎలుకలు ఒకచోట తిన్నగా ఉండకుండా మన ఇంట్లో బట్టలను, ధాన్యాలను మొత్తం పాడు చేస్తూ ఉంటాయి.
అంతేకాకుండా ఎలుకల వల్ల అంటు రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.మరి అలాంటి హానికరమైన ఎలుకలను ఎదుర్కోవడం ఎలాగా అని ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ చిట్కాలను పాటించండి.
పిప్పరమెంటు వాసన మనం ఎంతగా ఆస్వాదిస్తామో, అంతగా ఈ వాసన ఎలుకలకు నచ్చదు.కాటన్ బంతులలో కొద్దిగా పిప్పరమెంటు నూనెను వేసి వాటిని ఎలుకలు నివాసం ఉండే చోట ఉంచడం ద్వారా ఎలుకలు ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంటి దరిదాపుల్లోకి రావు.
ఎలుకలు తరచూ వచ్చే అవకాశం ఉందని మీరు గ్రహించిన ప్రతి చోట కాస్త బంగాళదుంప పొడిని చల్లండి.ఎలుకలు ఆ పొడిని తినడం వల్ల బంగాళదుంప రేకులు ఎలుకల ప్రేగులో ఉబ్బి చివరకు వాటిని చంపుతాయి.
ఉల్లిపాయ వాసనకు ఎలుకలు ఎంతగానో ఇబ్బంది పడతాయి.ఉల్లి పాయలు తొందరగా కుళ్లి పోతాయి కాబట్టి ప్రతి రెండు రోజులకు ఒకసారి మార్చాలి.ఎలకలు తిరుగుతున్న ప్రతి చోట చిన్న ఉల్లిపాయలను పెట్టడం ద్వారా ఇంట్లో ఎలుకల బెడద ఉండదు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పొడిని ఇంకా కొద్దిగా కోకో పౌడర్ రెండింటినీ కలిపి మిక్స్ చేసి దానిని ఎలుకలు తిరుగుతున్న చోట పెట్టడం ద్వారా ఎలుకలు ఈ మిశ్రమాన్ని తిని డీహైడ్రేషన్ కు గురవుతాయి.
నీటి కోసం బయటికి వెళ్లి అక్కడే చనిపోయాయి.
అమ్మోనియా వాసనను ఎలకలు భరించలేవు కాబట్టి ఒక చిన్న గిన్నెలో అమ్మోనియా ద్రావణాన్ని పోసి తిరుగుతున్న చోట పెట్టడం వల్ల ఎలుకలు ఇంటి దరిదాపులలో ఉండవు అంతేకాకుండా లవంగాలను కూడా ఎలుకలు భరించలేవు.
కాబట్టి కొద్దిగా లవంగాలను ఒక క్లాత్ లో తీసుకొని ఎలకలు ఉండేచోట పెట్టడం ద్వారా ఎలుకలు ఇంటి నుండి బయటకు వెళ్లిపోతాయి.
ప్రతి ఇంట్లో వాడే పాత పద్ధతి అయినా కానీ ర్యాట్ ట్రాప్ వాడటం వల్ల ఎలుకల బెడద నుండి తప్పించుకోవచ్చు.







