కరోనా ఎఫెక్ట్: గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్...!

టెక్ దిగ్గజం కంపెనీ గూగుల్ సంస్థ గూగుల్ మ్యాప్స్ కు సంబంధించి సరికొత్త ఫీచర్లతో అప్డేట్ ను తీసుకు వచ్చింది.దీని మూలంగా ప్రజలు గూగుల్ మ్యాప్స్ లో వారి ఏరియాలో ఉన్న కరోనా కేసుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

 Corona Effect The Newest Feature In Google Maps Coronavirus, Covid19, Google Ma-TeluguStop.com

ఇందుకు సంబంధించి గూగుల్ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి గూగుల్ మ్యాప్స్ లో కొత్తగా కోవిడ్ 19 లేయర్ ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది గూగుల్ సంస్థ.ఇది వరకు మనం గూగుల్ మ్యాప్స్ లో లేయర్ బటన్ టాప్ చేయగానే మనకు రోడ్ వ్యూ.

శాటిలైట్ వ్యూ లాంటి వివిధ ఆప్షన్స్ కనిపించేవి.

ఇక ఈ కొత్త అప్డేట్ ద్వారా లేయర్స్ లిస్ట్ లో ఈ కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్.

ఈ లేయర్స్ లిస్ట్ లో కొత్తగా కోవిడ్ 19 అనే లేయర్ ను పొందుపరిచారు.దీని మూలంగా ప్రజలకు వారి ఏరియా లో నమోదైన కేసుల వివరాలను అతి సులభంగా తెలుసుకోవచ్చు.

దీంతో వారు ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ పరిస్థితి ఏమిటో ఇట్టే సులువుగా తెలుసుకోవచ్చు.అందువల్ల వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తెలుస్తోంది.

ఒకవేళ ఏ ప్రాంతంలోనైనా ఎక్కువ కరోనా కేసులు నమోదైనట్లు కనబడితే అక్కడకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు కూడా పడవచ్చు.

గూగుల్ సంస్థ తీసుకువచ్చిన ఈ సరికొత్త ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫార్మ్ కు గూగుల్ మ్యాప్ అందించబోతుంది.

ఇందుకు సంబంధించిన వివరాలను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.ఇక ఈ లేయర్ ను ప్రవేశపెట్టే ముందు గూగుల్ సంస్థ అనేక సోర్స్ ల నుండి సమాచారం సేకరించినట్లు తెలిపారు.

ఇందులో ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే వివిధ దేశాల ప్రభుత్వాలకు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖలను కలుపుకుంటూ వారి దగ్గర నుండి సోర్సు లను తీసుకుని గూగుల్ మ్యాప్ లో ఈ సరికొత్త టెక్నాలజీ కిందికి తీసుకువచ్చినట్లు ఆయన తెలియజేశారు.దీంతో ఇప్పుడు ప్రజలు వారి ప్రాంతాలలో కేసులు ఎంత మొత్తంలో ఉన్నాయో తెలిసిపోతుంది.

అంతేకాదు ఈ లేయర్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ను బట్టి కూడా పలు రంగుల్లో లేయర్ మారుతూ ఉంటుంది.ఒకవేళ కేసుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటే ఎరుపు రంగులో కనబడుతుంది.

అంతేకాదు ఆ ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందా…? లేదా తగ్గుతుందా…? అన్న పూర్తి వివరాలు కూడా అక్కడ తెలియపరుస్తాయి.ఈ కొత్త ఫీచర్ ని గూగుల్ ఉపయోగించే యూజర్లు ఉపయోగించుకోవాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube