రేవంత్ మామూలోడు కాదండోయ్ ! కేసీఆర్ కు ఇలా ఎర్త్ పెడుతున్నాడా ?

తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కానీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను ఎదుర్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదు.

రాజకీయ ఎత్తులకు పైఎత్తులు వేయడంలో కేసీఆర్ బాగా ఆరితేరిపోయారు.

ఎప్పటికప్పుడు ప్రజల నాడీ ఏంటనేది పసిగట్టడంలో కేసీఆర్ దిట్ట.ఆంధ్ర, తెలంగాణ విభజన తరువాత కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు గట్టిగానే కష్టపడ్డారు.

ఆ సమయంలో ప్రజలను ఆకట్టుకుని రెండోసారి తిరుగులేని అధికారాన్ని సంపాదించుకున్నారు.ఇక తనకు రాజకీయ ప్రత్యర్థులతో ముప్పు ఏర్పడకుండా , అన్ని రకాల జాగ్రత్త చర్యలను తీసుకున్నారు.

క్రమంగా తమ రాజకీయ ప్రత్యర్దులందరినీ బలహీనం చేశారు.దీనిలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎదురుదెబ్బ తీశారు.

Advertisement

ఆ పార్టీలో కీలక నాయకులు అందరినీ టిఆర్ఎస్ లో చేర్చుకునే విషయంలో సక్సెస్ అయ్యారు.దీంతో కాంగ్రెస్ బాగా బలహీన పడిపోయింది.

అయితే అదే సమయంలో కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకున్నారు.ఆ ఊపుతో రేవంత్ మరింతగా కేసీఆర్, కేటీఆర్ టిఆర్ఎస్ నాయకులపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, అడుగడుగునా ఇబ్బంది కలిగిస్తూ వస్తున్నారు.

రేవంత్ ను ఎదుర్కోవడం కేసీఆర్ కు సైతం ఇబ్బందికరంగానే మారింది.అయితే కేసీఆర్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రేవంత్ మరో వ్యూహానికి పదును పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టిఆర్ఎస్ లోని చాలామంది నాయకులు చాలామంది అధిష్టానంపై తీవ్ర  అసంతృప్తి తో ఉన్నారు.ఇప్పుడు వారందరినీ తమ దారిలోకి తెచ్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

కేసీఆర్ పై యుద్ధం చేయాలనే విధంగా రేవంత్ వ్యవహరిస్తున్నారు.టిఆర్ఎస్ లో కేటీఆర్, కేసీఆర్ విధానాలు నచ్చని నాయకులు చాలామంది ఉన్నారు.

Advertisement

అప్పుడప్పుడూ వారు బహిరంగంగానే అధిష్ఠానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు.ముఖ్యంగా మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ కొంతకాలంగా టీఆర్ఎస్ పై అసమ్మతి వెళ్లగక్కుతున్నారు.

ఓ సందర్భంలో రేవంత్ తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైన స్వామి గౌడ్ రేవంత్ ను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు.అగ్ర కులంలో పుట్టిన రేవంత్ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో పాటు పడుతున్నారని, వారికి మనమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందంటూ వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది.

స్వామి గౌడ్ ఆ సమయంలోనే కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగినా, ఆయన మాత్రం టిఆర్ఎస్ లోనే ఉంటూ తన అసమ్మతిని తెలియజేస్తున్నారు.ఇంకా అనేక మంది నాయకులు స్వామి గౌడ్ బాట పట్టేందుకు  చూస్తుండడం, వారిని మరింత ప్రోత్సహించే విధంగా  రేవంత్ వ్యవహరిస్తున్న తీరు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆందోళన కలిగిస్తోంది.

తాజా వార్తలు