నా కోరిక ఇదే అంటూ మోడీ ఎమోషనల్ ట్వీట్..!

నిన్న భార‌త ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర ‌మోడీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయనకు శుభాకాంక్ష‌లు మిన్నంటాయి.

దేశాధి నేతలు, ప్ర‌జ‌ల‌తో పాటుగా ప్ర‌పంచ ‌వ్యాప్తంగా ఉన్న దేశాధి నేత‌లు వివిధ సోషల్ మీడియా మాధ్యమాలు ద్వారా ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియజేసారు.

ఈ క్రమంలోనే, తాజాగా.అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌ న‌రేంద్ర మోడీకి బ‌ర్త్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక మోడీకి ట్రంప్ కు మధ్య ఉన్న సాన్నిత్యం గురించి అందరికీ తెలిసినదే.ఈ సందర్భంగా.

ఫిబ్ర‌వ‌రిలో ఇండియా టూర్‌ కు సంబంధించి అహ్మ‌దాబాద్‌ లోని మోతేరా స్టేడియంలో జ‌రిగిన కార్యక్రమంలో దిగిన ఫోటోను ట్రంప్ పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం.ఇకపోతే.

Advertisement

తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నరేంద్ర మోడీ తన వైపునిండి ధన్యవాదాలు తెలిపారు.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్ర‌తీ ఒక్క‌రు భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాల‌ని ఆయన కోరారు.

ఈ సందర్భంగా మోడీని చాలా మంది పుట్టిన రోజు నాడు ఎలాంటి కానుక కావాలని అడిగారంటూ తెలియజేశారు.దీనికి బదులుగా ఆయన "ఇప్పుడు నాకు కావలసింది ఒకే ఒక్కటి.

ప్ర‌తీ ఒక్క‌రు మాస్క్‌ లు ఖచ్చితంగా ధరించండి.అలాగే సామాజిక దూరాన్ని పాటించండి.

రద్దీ ప్రదేశాలకూ ససేమిరా వెళ్ల‌కండి.మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

రోగ నిరోధక శక్తిని మరింత పెంచుకోండి.మొత్తంగా.

Advertisement

మన భూ గ్రహాన్ని ఆరోగ్యంగా తయారు చేద్దాం." అని కోరారు.

కాగా. న‌రేంద్ర ‌మోడీ నిన్న గురువారం నాటికి 70వ వసంతంలోకి అడుగు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి హృదయ పూర్వకమైన ఆకాంక్షలను అందుకున్న మోడీ "నన్ను పలకరించిన ప్రతి వ్యక్తికి నేను కృతజ్ఞుడిని. ఈ అభినందనలు నా తోటి పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సేవ చేసేందుకు నాకు మరింత శక్తినిస్తాయి.

" అని మరో ట్వీట్‌ లో పేర్కొన్నారు.

తాజా వార్తలు