బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్.ప్రస్తుతం నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.సెప్టెంబర్ 6 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్.మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టిన.ఇక మొదటి వారం దర్శకుడు సూర్య కిరణ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.సత్యం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సూర్య కిరణ్.
ధన 51, రాజుభాయ్ వంటి సినిమాలు తీసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఈయన చెన్నై వెళ్లిపోయాడు.
ఇక గత కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సూర్య కిరణ్.ఇటీవల బిగ్‌బాస్‌లోకి రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక మొదటి రోజు నుంచీ ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు సైతం సూర్యకిరణ్ ప్రవర్తన నచ్చకపోవడంతో.ఇంటి నుంచి బయటకు పంపించేశారు.
అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సూర్య కిరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.
బిగ్ బాస్ ఇంటి సభ్యుల గురించి సూర్య కిరణ్ మాట్లాడుతూ.బిగ్ బాస్ హౌస్‌లో అమ్మ రాజశేఖర్ తప్ప సినిమాలతో జనాల ఆదరణ సంపాదించిన వారు ఎవరూ లేరు.కానీ అందరూ పెద్ద సెలబ్రిటీల్లా ఫీలవుతూ ఉంటారని హాట్ కామెంట్స్ చేశారు.
అలాగే ఇంటి సభ్యులు ఎవరూ సహజంగా ప్రవర్తించరు.అందరూ నటించేవాళ్లే.
ఓవర్ యాక్షన్ చేస్తేనే.ఫుటేజీ ప్రేక్షకులకు కనిపిస్తుందని వాళ్లకు బాగా తెలుసు.
అందుకు వాళ్లంతా చాలా ప్రిపేర్ కూడా అయ్యారంటూ సూర్య కిరణ్ చెప్పుకొచ్చాడు.అయితే నేను నాలా ఉన్నాను.అందుకే నటించే వ్యక్తుల మధ్య నాకు ప్రతిరోజూ చాలా భారంగా గడిచేది అని సూర్య కిరణ్ వ్యాఖ్యానించారు.ఇక బిగ్ బాస్‌కు డబ్బు కోసమే రాలేదని.
తన ఉనికిని కాపాడుకునేందుకే వచ్చానని స్పష్టం చేశాడు.