అప్పు తీర్చలేదని 7 నెలల గర్భిణిని తన్నారు... చివరకు?

దేశం అభివృద్ధి పరంగా ఎంత ముందుకెళుతున్నా దేశంలో అమానుష ఘటనలు మాత్రం ఆగడం లేదు.మహిళల విషయంలో కొందరు దారుణంగా వ్యవహరిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు తెస్తున్నా అమానుష ఘటనలు దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి.తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

అప్పు తీర్చలేదనే నెపంతో ఒక వ్యక్తి గర్భిణి పొత్తికడుపుపై తన్నాడు.బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే యూపీలోని ఘజియాబాద్ ప్రాంతంలోని గుంకా గ్రామంలో సంజయ్ వర్మ అనే వ్యక్తి తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు.సంజయ్ వృత్తిరిత్యా ఒక ప్రైవేట్ కంపెనీలో చాలీచాలని జీతంతో పని చేసే వాడు.

Advertisement

అయితే గతేడాది ఊహించని కష్టాలు ఎదురు కావడంతో పొరుగున నివాసం ఉంటున్న వ్యక్తి నుంచి సంజయ్ 1,20,000 అప్పుగా తీసుకున్నాడు.అయితే వేర్వేరు కారణాల వల్ల ఆ అప్పును తీర్చడం సంజయ్ వర్మకు సాధ్యం కాలేదు.

అప్పు తీసుకునే సమయంలో సంజయ్ పొరుగింటి వ్యక్తికి తనఖా కింద భార్యకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఇచ్చాడు.అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల జీతం మరింత తగ్గడంతో సంజయ్ అప్పును తీర్చలేకపోయాడు.

దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తితో పాటు మరో ఆరుగురు సంజయ్ ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేయడంతో పాటు గర్భవతి అయిన అతని భార్య కడుపుపై కాలితో తన్నారు.దీంతో ఆమె నరకయాతన అనుభవించింది.

సంజయ్, ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా కడుపులోకి బిడ్డ చనిపోయిందని తేలింది.అమానుషంగా దాడి చేయడం వల్లే భార్య మృతి చెందిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఆ తరువాత సంజయ్, అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ వర్మ ఈ ఘటనపై స్పందిస్తూ చనిపోయిన శిశువు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కేసు దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు