కొత్తగా స్ప్రే రూపంలో వాక్సిన్.. ఆ దేశంలో ట్రయల్స్ కు రంగం సిద్ధం...!

కరోనా రక్కసి ధాటికి ప్రపంచ దేశాలు చతికలపడ్డాయి.రోజురోజుకీ పెరిగి పోతున్న కోవిడ్ కేసులతో పలు రాష్ట్రాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.

ఈ నేపథ్యంలో టీకా కోసం ఇంచుమించు అన్ని దేశాలు చాలా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి.ఇప్పటికే రష్యా దేశం వాక్సిన్ ను అక్కడ రిలీజ్ చేసిన సంగతి విదితమే.

మన ఇండియా ఇంకా స్టేజ్ 2 స్థాయిలో ప్రయోగాలు చేస్తోంది.కాగా.

ఇప్పటికే 7 వాక్సిన్ లు క్లినికల్ దశల్లో ఉండగా.అందులో 4 వాక్సిన్ లు చైనాలోనే ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Advertisement

అంతటితో ఆగకుండా.చైనా ఇప్పుడు మరో వాక్సిన్ ను కనుగొనే పనిలో బిజీ అయ్యింది.

మాములుగా వాక్సిన్ అనేది మనకు సూది మందు ద్వారా ఇవ్వడం జరుగుతుంది.అయితే డ్రాగన్ కంట్రీ దీనికి భిన్నంగా స్ప్రే రూపంలో వాక్సిన్ ను మార్కెట్ లోనికి తీసుకురాబోతుంది.

ఎలా అంటే.ముక్కులో స్ప్రేను చిలకరించడం ద్వారా కరోనా వైరస్ ను అంతం చేయవచ్చని వారు అభిప్రాయ పడుతున్నారు.

జియామెన్ విశ్వవిద్యాలయం, హాంకాంగ్ యూనివర్శిటీ, బీజింగ్ వాంటై బయోలజికల్ ఫార్మ సంస్థలు కలిసి ఈ వాక్సిన్ ను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తాజా సమాచారం.ఇక ఈ వాక్సిన్ ట్రయల్స్ కు చైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

త్వరలోనే అక్కడ ట్రయల్స్ ను నిర్వహించి, తద్వారా మార్కెట్ లోని తీసుకు రావాలని వారు అనుకుంటున్నారు.కాగా.

Advertisement

వచ్చే ఏడాదికి ఈ ట్రయల్స్ పూర్తవుతాయని, ఒకవేళ సక్సెస్ అయితే, కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో అరికట్టడం మరింత తేలిక అవుతుందని అక్కడి పరిశోధకులు చెప్తున్నారు.చూడాలి మరి ఈ కొత్త రకపు వాక్సిన్ ఎన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తుందో.? ఎంతలా పనిచేస్తుందో.!.

తాజా వార్తలు