గూగుల్ మ్యాప్స్ లో ఈ కొత్త టెక్నాలజీ తో మరింత మెరుగైన ఫలితాలు...!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ లేకుండా ఏ పని ముందుకు సాగడం లేదు.అంతలా టెక్నాలజీ మానవ ప్రపంచం లో కలిసి పోయింది.

ఇక ఎవరైనా ఎప్పుడైనా తెలియని లేదా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మనం ఎక్కడికి వెళ్లాలో డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడి వరకు ఎలా వెళ్లాలో గూగుల్ మ్యాప్స్ మనకు దారిని చూపిస్తుంది.అంతే కాదు ఆ ప్రదేశానికి నువ్వు ఎంత సమయంలో చేరుకోగలరు అనేది కూడా మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై క్లియర్ గా చూపబడుతుంది.

ఇక కొత్తగా ఈ గూగుల్ మ్యాప్స్ లో మరో ఏర్పాటును కూడా అందించబోతుంది.ఇందుకోసం కొత్తగా డీప్ మైండ్ సంస్థ తో కలిసి ఒక కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్ మ్యాప్స్.

ఇక ఈ టెక్నాలజీ పరంగా మనం ప్రయాణించే మార్గంలో ఏవైనా అవంతరాలు కలిగిన, ట్రాఫిక్ జామ్ లాంటివి ఏర్పడిన వాటిని మొత్తం పరిగణలోకి తీసుకొని వీలైనంత ఖచ్చితత్వం ఫలితాలను చూపించే విధంగా ఈ టెక్నాలజీని రూపొందించనున్నారు.దీనితో 97% సందర్భాలలో గమ్యస్థానానికి ఖచ్చితమైన సమయానికి చేరుకునేది వీలుగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడం సాధ్యమైందని గూగుల్ మ్యాప్స్ అభిప్రాయం తెలియచేసింది.

Advertisement

కరోనా వైరస్ రాకముందు, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కొన్ని పెద్ద పెద్ద నగరాలలో, ముఖ్య పట్టణాలలో ట్రాఫిక్ గణనీయంగా మారిపోయింది.వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కూడా సదరు వ్యక్తి చేరుకోవాల్సిన గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుంటారు అన్న దానిపై గూగుల్ మ్యాప్స్ సరైన అంచనాలు అందించే ఏర్పాట్లను చేయబోతోంది.

వీటిని బట్టి ఇక ముందర గూగుల్ మ్యాప్ ద్వారా ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు అని అర్థమవుతోంది.

Advertisement

తాజా వార్తలు