మంజునాథ ఆలయంలో ఏనుగు జలకాలాడటం ఎపుడైనా చూశారా..?

శ్రీ మంజునాథ సినిమా ఇంచుమించు అందరూ చూసే వుంటారు.22 జూన్, 2001లో విడుదలైన సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

మంజునాథుడిగా మెగాస్టార్ చిరంజీవి, అతని భక్తుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ అదరగొట్టేశారు.

ఇప్పుడీ విషయం ఎందుకంటారా? అక్కడికే వస్తున్నా.ఆ సినిమా చుసిన ప్రతి ఒక్కరికీ ఒక్కసారైనా.

క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ద‌క్షిణ క‌న్న‌డ జిల్లా ధ‌ర్మ‌శాల‌లోని కొలువైన శ్రీ మంజునాథ స్వామిని చూడాలనే కోరిక కలగక మానదు.ఇక్కడి ఆలయం చాలా ప్రత్యేకమైనది.

శివుని పేరిట మన దేశంలో చాలా ఆలయాలు వున్నాయి.అయితే మంజునాథుడి పేరుతో ఆలయాలు చాలా అరుదుగానే మనకు కనబడతాయి.

Advertisement

అందులో ప్రముఖమైనది ఈ ఆల‌యం.ఇక్కడ ఇటీవల జరిగిన ఓ సంఘటన చూపరులను అలరించింది.

అవును.ఓ ముచ్చ‌టైన దృశ్యం భ‌క్తుల‌కు క‌నువిందు చేసింది.

చిన్న ఏనుగుపిల్ల చాలా చలాకీగా నీటితో ఆడుతూ అక్కడ స్వామివారికోసం వచ్చిన జనాలను పలకరించింది.మంజునాథ స్వామి ఆల‌యంలో కొన్ని సంవత్సరాలుగా రెండు ఏనుగులు ఉంటున్నాయి.

అవే ఏనుగులను ఉపయోగించి ఉత్స‌వాలలో స్వామివారిని ఊరేగిస్తూ వుంటారు.అందులో ఒకటి జూలై 1న‌ ఓ బుల్లి ఏనుగు పిల్ల‌ను క‌న్న‌ది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇప్పుడు ఆ ఏనుగు పిల్ల వయస్సు రెండు నెల‌లు మాత్రమే.ఇకపోతే నీళ్ల‌లో ఆడుకోవ‌డం అంటే ఆ బుజ్జి ఏనుగుకు ఎంతో ఇష్ట‌మ‌ని మంజునాథ స్వామి ఆల‌య పూజారులు చెప్పారు.

Advertisement

మ‌రి ఆ బుజ్జి ఏనుగు నీటితో ఆడుతూ భ‌క్తుల‌ను ఎలా పలకరించిందో చూస్తారా?.

తాజా వార్తలు