నాడు దేశం గర్వించే అథ్లెట్.. నేడు హంతకుడు: అమెరికాలో భారత క్రీడాకారుడు అరెస్ట్

క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపి దేశం గర్వించేలా చేసి, ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న అథ్లెట్ కన్న తల్లిని, కట్టుకున్న భార్యను హత్య చేసి నేడు సమాజం ముందు దోషిలా నిలబడ్డాడు.భారత సంతతికి చెందిన అథ్లెట్ ఇక్బాల్ సింగ్ అమెరికాలో జరిగిన హత్య కేసులో అరెస్ట్ అయ్యారు.

భారతదేశం తరపున 1983లో కువైట్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌లో షాట్‌పుట్‌లో ఇక్బాల్ కాంస్య పతకం సాధించాడు.1988లో ఢిల్లీలో జరిగిన పర్మిట్ మీట్‌లో స్వర్ణ పతకం సాధించాడు.అనంతరం టాటా స్టీల్, పంజాబ్ పోలీస్ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఇక్బాల్ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు.62 ఏళ్ల ఇక్బాల్ సింగ్ ప్రస్తుతం డెల్వార్ కౌంటీలో నివాసం ఉంటున్నారు.ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆదివారం ఇక్బాల్ ఇంటికి వెళ్లిన పోలీసులకు ఆయన రక్తమోడుతూ కనిపించాడు.

అదే ఇంట్లో ఇద్దరు మహిళల మృతదేహాలు సైతం లభించాయి.అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణ జరిపారు.

తన తల్లి నసీబ్ కౌర్, భార్య జస్పాల్ కౌర్‌ను తానే గొంతు కోసి హత్య చేసినట్లు ఇక్బాల్ అంగీకరించాడు.అయితే హత్యలకు గల కారణాలు ఇంకా తెలియలేదు.

వారిని హత్య చేసిన అనంతరం ఇక్బాల్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయాల్సిందిగా కుమారుడికి చెప్పాడు.సింగ్‌కు అయిన గాయాలు కూడా తనంతట తాను చేసుకున్నవేనని పోలీసులు వెల్లడించారు.

Advertisement
బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?

తాజా వార్తలు