ఓ దొంగల ముఠా సినిమాలో జరిగే విధంగా చోరికి పాల్పడ్డారు.చిన్న చిన్న దొంగతనాలు చేసి ఏం బతుకుతామని భావించారో ఏమో ఏకంగా మొబైల్ ఫోన్ల లోడ్ తీసుకెళ్తున్న లారీకే కన్నం వేశారు.
లారీని వేరే ప్రాంతానికి తరలించి లోపల ఉన్న సరుకును కాజేశారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
లారీతో పాటు లారీలో ఉన్న మొబైల్ ను దొంగలించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.తమిళనాడులోని కాంచీపురం శ్రీపెరంబూరు నుంచి షియోమీ సంస్థ గోదాముకు ఓ లారీ లోడ్ తీసుకుని బయలుదేరింది.తమిళనాడు- ఏపీ సరిహద్దుల్లో ఓ దొంగ ముఠా రూ.12 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను కొట్టేసింది.లారీ ఏపీ సరిహద్దుల్లోకి రాగానే.ఆ లారీ వెంబడి ఇంకో లారీ ఓవర్ టెక్ చేస్తూ లారీ ముందు వచ్చి నిలబడింది.దొంగలు గన్లు పట్టుకుని కిందికి దిగి డ్రైవర్, క్లీనర్ ను బెదిరించి లారీ నుంచి కిందికి దింపారు.కాళ్లు, చేతులు కట్టేసి లారీని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసుల కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని లారీని గుర్తించారు.డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.







