తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారి నగరాల నుండి పల్లె బాట పట్టింది.
ఈ మహ్మమరి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోగా మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ వైరస్ కి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు కోవిడ్ నిబంధలను పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.కానీ ఈ మహమ్మారి సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు, ఆఫీసర్లు ఎవరిని వదిలిపెట్టడం లేదు.
ఇప్పటికే చాల మంది ఆఫీసర్స్ ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలను కోల్పోయారు.తాజాగా మరో అధికారి కరోనా కాటుకు బలై ప్రాణాలు కోల్పోయారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.మంచిర్యాల అటవీ డివిజన్‌లో సంతోష్ మండల్(55) దేవపూర్ ఫారెస్ట్ రేంజ్‌లో ఎఫ్‌బీవోగా విధులు నిర్వహిస్తున్నాడు.కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్ళాడు.వైద్యులు అతనికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది.
అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
మృతుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.