పెన్షన్ కోసం వెళ్లిన 54మందికి కరోనా పాజిటివ్..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టింస్తుంది.నిత్యం ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

 Telangana, Vanaparti Distic, Corona-TeluguStop.com

ఈ వైరస్ కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు ఈ మహమ్మారి బారినపడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.

కానీ ప్రజలు కోవిడ్ నిబంధలను ఉల్లంఘిస్తున్నారు.అయితే ఈ వైరస్ ఎప్పుడు ఎవరి దగ్గరి నుండి ఎలా సోకుతుందో కూడా తెలీదు.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో ఓ గ్రామంలో పింఛన్ తీసుకోవడానికి వెళ్లిన 54మందికి కరోనా వైరస్ సోకింది.దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో కరోనా కలవరం మొదలైంది.

అయితే ఆ గ్రామంలో పింఛన్లు అందజేసే వ్యక్తి నుండే కరోనా వైరస్ వ్యాపించిందని నిర్దారించారు.అంతేకాక కొన్ని రోజుల క్రితం అతడికి కరోనా సోకిన కూడా పింఛన్లు పంపిణీ చేశాడు.

అయితే పింఛన్ పంపిణీ చేసిన వ్యక్తి ఇంట్లో ఒకరు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండంగా అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.వైద్యులు అతనికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.

ఇక పింఛన్ పంపిణీ చేసిన వ్యక్తి కుటుంబంలో 9 మందికి కరోనా సోకినట్లు తెలిపారు.వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ గ్రామంలో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షలలో 54మందికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు.కరోనా సోకిన వారందరికీ వైద్యులు హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube