కరోనాని జయించారా అయితే ఈ టెస్ట్ తప్పనిసరి..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.కేసుల పెరుగుదల సంఖ్యతో పాటు కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది.

అయితే ఇన్ని రోజులు కరోనా నుంచి క్యూర్ అవడానికి కష్టాలు పడినా ఆ తర్వాత ఇబ్బందులు తప్పవని అంటున్నారు డాక్టర్లు.కరోనా బారిన పడిన బాధితుల్లో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

ఎక్కువగా కరోనా నుంచి క్యూర్ అయిన వారిలో రక్తం గడ్డ కట్టడాన్ని బెంగళూరు డాక్టర్లు గుర్తించారు.ఈ మేరకు నిర్ణీత సమయం వరకు డీ-డైమర్ అనే పరీక్షలు చేసి బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు.

ఇన్ని రోజులు కరోనా వైరస్ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుందనుకున్నారు డాక్టర్లు.కానీ తాజాగా గుండె, ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుందని మణిపాల్ ఆస్పత్రిలో ఇంటర్వెన్షియల్ కార్డియాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రంజన్ శెట్టి కనుగొన్నారు.

Advertisement

కరోనా బాధితుల్లో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించారు.ఈ మేరకు డిశ్చార్జ్ అయిన 4-6 వారాల తర్వాత కూడా ఈ సమస్య తలెత్తుతుందని, డీ-డైమర్ టెస్టుల ద్వారా శరీరంలో రక్తం ఎక్కడ గడ్డ కట్టిందో తెలుసుకోవచ్చన్నారు.

కోవిడ్ బాధితుల్లో శ్వాస సంబంధిత సమస్య ఉన్న వారిలో మెల్లిగా బ్లడ్ క్లాటింగ్ సమస్య పెరుగుతుందన్నారు.కరోనా నుంచి కోలుకున్న తర్వాత డీ-డైమర్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు