అమెరికాలో ఘనంగా వినాయకుడి నిమజ్జనం..!!

భారతీయులు ఎక్కడ ఉన్నా మన దేశ సంస్కృతీ సాంప్రదాయలను పాటిచడం మాత్రం మర్చిపోరు.మేముఎక్కడైనా భారతీయులమేనని చాటి చెప్తూనే ఉంటారు.

భారతీయ పండుగలను అందరూ కలిసి సామూహికంగా జరుపుకుంటూ తమ భవిష్యత్త్ తరాలు ఈ సాంప్రదాయాలు మర్చిపోకుండా, కొనసాగించేలా తెలియజేస్తూ ఉంటారు.ఐతే వివిధ దేశాలలో ఉన్న భారతీయులు తప్పకుండా, ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ వినాయక చవితి.

ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుని, నిమజ్జనం కూడా నిర్వహిస్తారు.ఈ ఏడాది కరోనా కారణంగా చాలా చోట్ల వినాయక చవితి పండుగను బహిరంగంగా జరుపుకోలేక పోయినా కరోనా నిభందనలకు అనుగుణంగా కొన్ని దేశాలలో భారతీయులు వేడుకలని నిర్వహించారు.

ఈ క్రమంలోనే అమెరికాలోని వాషింగ్టన్ లో ఉన్న తెలుగు ఎన్నారైలు వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు.కరోనా మహామ్మారి ప్రపంచం మొత్తాన్ని కబళించిందని, ఈ మహామ్మరిని తరిమి కొట్టాలని గణనాధుడిని వేడుకున్నామని తెలిపారు.

Advertisement

ఈ వేడుకలని స్థానిక ప్రభుత్వం చెప్పిన నిభంధనల ప్రకారం నిర్వహించుకున్నామని ఈ ప్రాంతంలో ఉన్న తెలుగువారు ప్రతీ ఒక్కరూ గణపతికి రోజు పూజలు నిర్వహించారని తెలిపారు.చివరిగా గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న తెలుగువారందరూ హాజరయ్యారు.పెద్దలు, పిల్లలు ఎంతో ఉశ్చాహంగా పాల్గొన్న ఈ వేడుకలు ఎంతో ఆకట్టుకున్నాయి.

ఈ ప్రాంతంలో స్థానికంగా ఉన్న ఓ సరస్సులో వినాయకుడిని నిమజ్జనం చేసినట్టుగా ఎన్నారైలు తెలిపారు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు