మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇప్పటికే స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.వచ్చే నెల మరల సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ అందరూ కుర్ర దర్శకులని లైన్ లో పెట్టాడు.ఆచార్య తర్వాత సుజిత్ దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయ్యింది.మెజారిటీ కంప్లీట్ అయ్యే దశలో ఉంది.
సాహో టేకింగ్ నచ్చి చిరంజీవి లూసీఫర్ మూవీ దర్శకత్వ బాద్యతలు సుజిత్ కి అప్పగించారు.ఇక ఈ సినిమా తర్వాత డిజాస్టర్ చిత్రాల దర్శకుడుగా టాలీవుడ్ లో ముద్ర పడ్డ మెహర్ రమేష్ దర్శకత్వంలో అజిత్ వేదాలం మూవీని చిరంజీవి రీమేక్ చేస్తున్నాడు.
దీనికి సంబందించిన వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత మరో యంగ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మెగాస్టార్ రెడీ అయినట్లు సమాచారం.
అయితే ఇది రీమేక్ కాదని, స్ట్రైట్ కథ అని సమాచారం.బాబి రీసెంట్ గా చెప్పిన స్టొరీ లైన్ నచ్చి అతనితో వర్క్ చేయడానికి చిరంజీవి ఒకే చెప్పాడని తెలుస్తుంది.
ఇక బాబీ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసినట్లు టాక్.ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించడానికి ముందుకి వస్తున్నట్లు తెలుస్తుంది.
చిరంజీవి చేయబోయే సినిమాలకి సంబంధించి అన్ని అప్డేట్స్ వచ్చే ఏడాదిలో ఉంటాయని సమాచారం.బాబి సినిమాతో పాటు లూసీఫర్ రీమేక్ లో కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామిగా ఉండటానికి సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ నిర్మాతలు సినిమా కన్ఫర్మ్ చేసుకున్నారు.అలాగే కుర్ర హీరో అయిన వైష్ణవ్ తేజ్ ని లాంచ్ చేస్తున్నారు.
అలాగే పుష్ప మూవీని అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్నారు.మొత్తానికి మెగా హీరోలు మొత్తాన్ని మైత్రి నిర్మాతలు లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది.