సదుపాయాలు లేక కరోనా బాధితుల అవస్థలు.. ఆగని మరణాలు..!

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.మరణాల సంఖ్య కూడా అలానే పెరుగుతోంది.

వరంగల్ లోని ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి.ఎంజీఎంలోని ల్యాబ్ లో విధులు నిర్వహించే ఖుర్షీద్ కు కరోనా లక్షణాలు రావడంతో చికిత్స పొందుతున్నాడు.

సమస్య తీవ్రమవడంతో ఆయన ఆదివారం మృతి చెందాడు.ఆస్పత్రిలో మరణాల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా బాధితులు భయాందోళనకు గురవుతున్నారు.

మెరుగైన వైద్య సేవలు లేకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయని బాధితులు వెల్లడించారు.బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్న ఆర్ఎంఓ, వైద్యసిబ్బంది పట్టించుకోని పరిస్థితి నెలకొంది.

Advertisement

ఎంజీఎంలో వైద్య సదుపాయాలు లేక కరోనాతో వరుస మరణాలు సంభవిస్తున్నాయి.మరో ఇద్దరు కరోనా బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

ఆస్పత్రిలో ఎలాంటి సదుపాయాలను ప్రభుత్వం ఏర్పరచడం లేదని, వసతులు కల్పించాలని 12 మంది డాక్టర్లు ఆందోళనకు దిగారు.వైద్యుల ఉన్నా వైద్యానికి సరిఫడా కనీస వసతుల కల్పించడం లేదని వాపోతున్నారు.

మెడికల్ కిట్లు సత్వరమే అందించాలని డిమాండ్ చేశారు.కాగా, కరోనా సమయంలో సూపరింటెండెంట్ పదవికి రాజీనామా చేసి వారం దాటినా ఆ స్థానాన్ని భర్తీ చేయలేదన్నారు.

పై అధికారి లేక సమన్వయ లోపం ఏర్పడుతుందని డాక్టర్లు పేర్కొన్నారు.త్వరలో సూపరింటెండెంట్ పదవిని భర్తీ చేయాలని వారు కోరారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు