కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్... ఆసక్తి కలవారికి ఆహ్వానం

కరోనా మహమ్మారి ప్రపంచంతో పాటు దేశంలో కూడా చాలా వేగంగా విస్తరిస్తుంది.దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరో వైపు శాస్త్రవేత్తలు, ఫార్మా దిగ్గజాలు కరోనాకి వ్యాక్సిన్ తయారు చేయడం కొడం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ తయారు చేసే పనిలో పడ్డాయి.

ఇక ఇండియాలో కూడా కరోనాకి సంబందించిన వాక్సిన్స్ ని సిద్ధం చేసే ప్రయత్నం చాలా కంపెనీలు చేస్తున్నాయి.భారతదేశపు తొలి కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ ని హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ తయారు చేసింది.

ఇప్పటికే ఈ వ్యాక్సిన్ మొదటి ట్రయిల్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని క్లీనికల్ ట్రయిల్స్ కి సిద్ధం అయ్యింది.కోవాగ్జిన్ వ్యాక్సిన్ ని ప్రస్తుతం మనుషులపై ప్రయోగిస్తున్నారు.

Advertisement

దేశవ్యాప్తంగా పలు చోట్ల ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి.ఢిల్లీ ఎయిమ్స్ లో సోమవారం నుంచి కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలుకానున్నాయి.18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులపై ఈ వ్యాక్సిన్ ప్రయోగిస్తారు.100 మంది ఆరోగ్యవంతులను ఈ మేరకు వలంటీర్లుగా ఎంపిక చేసుకుంటారు.ఈ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవాళ్లు 07428847499 అనే నెంబరుకు కాల్ చేయడం కానీ, ఎస్సెమ్మెస్ ద్వారా కానీ సమాచారం అందించవచ్చు.[email protected] మెయిల్ ఐడీ ద్వారా కూడా సంప్రదించవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు.ఇక ఈ వాక్సిన్ గాని క్లీనికల్ ట్రయిల్స్ లో సక్సెస్ అయితే ఆగష్టు 15 నాటికి అందుబాటులోకి వస్తుంది.మరి ఇది ఎంత వరకు విజయవంతం అవుతుంది అనేది వేచి చూడాలి.

ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కోవాగ్జిన్ క్లీనికల్ ట్రయిల్స్ కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు