వస్తున్న శ్రావణ మాసం,పెండ్లిళ్ల అనుమతి పై సర్కార్ జీవో!

శ్రావణ మాసం తెలుగు వారికి అది పెళ్లిళ్ల సీజన్ అని చెప్పాలి.ఈ మాసంలోనే ఎక్కువగా పెళ్లిళ్లు,ఫంక్షన్ లు చోటుచేసుకుంటూ ఉంటాయి.

అయితే మరికొద్ది రోజుల్లో ఈ శ్రావణ మాసం వస్తుండడం తో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దేశంలో,రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే పెండ్లిళ్ల అనుమతి విషయంలో కొన్ని నిబంధనలు పాటించాల్సి వస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల ప్రకారం పెండ్లిళ్ల కు కలెక్టర్ నుంచి అనుమతి పొందాల్సి ఉండేది.దీనితో కలెక్టర్ కు అర్జీ పెట్టుకొని ఆయన అనుమతి పొందే సరికి ఆలస్యం అవుతూ వచ్చేది.

ఈ నేపథ్యంలో ఇక పై ఈ వ్యవహారాలను తహసీల్దార్ లకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం కొత్తగా జీవో జారీ చేసినట్లు తెలుస్తుంది.ఈ నెల 21 నుంచి శ్రావణ మాసం ప్రారంభమౌతుండడం తో పెళ్లిళ్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉండడం తో ఏపీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే ఈ అనుమతులు కేవలం పెళ్లిళ్ల కు మాత్రమే అని,మిగిలిన ఫంక్షన్ లకు ఎలాంటి అనుమతులు ఉండబోవు అంటూ ఆ జీవో లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇరువైపులా కేవలం ఇరవై మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది.

అలానే అనుమతి కోరే వారు తప్పనిసరిగా వివాహ శుభలేఖ తో పాటు ,నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పై అఫిడవిట్ ను తాసిల్దార్ కు సమర్పించాల్సి ఉంటుందని, దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తో పాటు, కరోనా పరీక్షలు చేయించుకున్నట్టుగా వైద్యులు ఇచ్చిన ధ్రువపత్రాలను కూడా జతచేయాలట.ఒకవేళ ప్రభుత్వం జారీ చేసిన జీవో లో ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005 లోని సెక్షన్ 188 ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆ జీవో లో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఏపీ సర్కార్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు