రోజుకో క్యారెట్ తింటే ఎన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా..?

క్యారెట్‌.దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.నిండుగా ఆరెంజ్ కలర్ లో నిగనిగలాడే క్యారెట్.

కూరగాయలలో తియ్యటి కూరగాయ.అందుకే చాలా మంది దీన్ని ప‌చ్చిగా ఉన్న‌ప్పుడే తినేస్తుంటారు.

క్రంచీ వెజిటేబుల్‌ను అనేక వంట ల్లో ఉప‌యోగిస్తారు.ఇది వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి ఇవ్వ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూర్చుతుంది.

అయితే కొంద‌రు మాత్రం క్యారెట్‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.కాని, ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు తెలుసుకుంటే.

Advertisement

ఖ‌చ్చితంగా మీ డైట్‌లో క్యారెట్‌ను చేర్చుకుంటారు .క్యారెట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉండాయి.రోజుకో క్యారెట్ తింటే.

అందులో ఉండె విటమిన్ ఎ కంటి చూపు‌ను మెరుగుప‌రుస్తుంది.అలాగే క్యారెట్‌లో విటమిన్ సి కూడా మ‌న‌కు లభిస్తుంది.

ఇది కణాల ఆరోగ్యానికి, దంతాలు, చిగుళ్ల సంరక్షణకు స‌హాయ‌పడుతుంది.

అలాగే క్యారెట్ లో ఉండే సోడియం ర‌క్త‌పోటును కంట్రోల్ చేస్తుంది.అందుకే ఆరోగ్య నిపుణులు రోజుకో క్యారెట్ తీసుకోమని చెబుతున్నారు.అంతేకాకుండా, క్యారెట్‌ను మ‌న డైట్‌లో చేర్చుకోవ‌డం వలన లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
భోజన సమయంలో నీరు త్రాగటం మంచిదేనా

ఎంద‌కంటే.క్యారెట్‌లో ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ పై పోరాడేందుకు ఎంతగానో స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

గుండె ఆరోగ్యానికి కూడా క్యారెట్ గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.గుండె జ‌బ్బులు రాకుండా ఉండాల‌న్నా, గుండె ఆరోగ్యంగా ఉండాల‌న్నా.

ఖ‌చ్చితంగా రోజుకో క్యారెట్ తీసుకోవాల్సిందే.మ‌రియు శ‌రీరంలో రోగ నిరోధక శక్తి పెంచ‌డంలోనూ క్యారెట్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అదే స‌మ‌యంలో రక్తహీనతకు కూడా క్యారెట్‌ దివ్య ఔషధంగా పనిచేస్తుంది.కాబ‌ట్టి, ప్ర‌తి రోజు ఒక క్యారెట్ తీసుకోమంటున్నారు నిపుణులు.

తాజా వార్తలు