ప్రణయ్-అమృతల ప్రేమ కథతో ఆర్జీవి మర్డర్ సినిమా

కరోనా సమయంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్రజల క్యూరియాసిటీని కాష్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే మియా మాల్కొవాతో క్లైమాక్స్ అనే సినిమా తీసి జనాల మీద వదిలాడు.

మరో వైపు కరోనా వైరస్ అంటూ ఓ సినిమా కూడా లాక్ డౌన్ నేపధ్యంలో ఒక కుటుంబం మానసిక సంఘర్షణ గురించి సినిమా తీసి ట్రైలర్ వదిలాడు.

మరోవైపు నగ్నం అనే సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశాడు.ఈ సినిమా కూడా పూర్తిగా ప్రతి మనిషిగా అంతర్లీనంగా శృంగారంపై ఉండే వ్యామోహం ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఆవిష్కరిస్తున్నాడు.

ఇలా వరుసగా సినిమాలు తీసి ఓ వైపు హైప్ క్రియేట్ చేస్తూనే ఆర్జీవి మరింత ఇంత దిగాజారిపోయాడా అనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు.ఇదిలా ఉంటే మిర్యాలగూడెం లో ప్రణయ్-అమృతల కథ అందులో ప్రణయ్ ని పరువు హత్య చేయించిన మారుతీరావు తరువాత ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనల మధ్య ఆ సంఘటనలు ఒక సంచలనంగా మారాయి.

ఇప్పుడు ఆ కథని మర్డర్ అని టైటిల్ పెట్టి సినిమాగా తీసేస్తున్నాడు.దీనికి సంబందించిన పోస్టర్ ని కూడా వర్మ రిలీజ్ చేశాడు.

Advertisement

ఫాదర్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన మర్డర్ సినిమా టైటిల్ పోస్టర్ వైరల్ అయ్యింది.దీనికి కుటుంబ కథా చిత్రమ్ అనే ట్యాగ్ లైన్ కూడా వర్మ పెట్టాడు.

మరి ఈ కథ ద్వారా వర్మ ఏం చెబుతాడు అనేది అందరిలో ఆసక్తి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు