గంటలో పెళ్లి...  ఇంతలో కరోనా కలకలం...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా దాదాపుగా అన్ని ముఖ్యమైన పనులు, పెళ్ళిళ్ళు శుభకార్యాలు, ఇతరత్రా పనులు వంటివి ఆగి పోయాయి.

అయితే తాజాగా ఓ నవ వధువు పెళ్లి చేసుకొని అత్తారింట్లో హాయిగా కాపురం చేయాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా తన పెళ్లి పెళ్లి పీటలు మీదే ఆగిపోయిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని నెల్లూరు జిల్లా యువతికి కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి పరిసర ప్రాంతానికి చెందిన టువంటి ఓ యువకుడితో తాజాగా పెళ్ళి నిశ్చయమైంది. ఈ క్రమంలో వరుడి ఇంట్లో పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబ సభ్యులు నిశ్చయించారు.

దీంతో వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటికి వెళ్లారు.దీంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్నటువంటి వైద్యాధికారులు పెళ్లి బంధువులు మరియు కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పెళ్ళి కూతురు చెల్లెలు మరియు తండ్రికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.

అలాగే స్థానికంగా ఉన్నటువంటి మరికొంతమందిని పరీక్షించగా పాజిటివ్ అని తేలింది.దీంతో అప్రమత్తమైనటువంటి వైద్య అధికారులు వెంటనే కరోనా వైరస్ బారిన పడిన వారిని క్వారంటైన్ కి తరలించారు.

Advertisement

అలాగే మరికొంత కాలం పాటు పెళ్లిని వాయిదా వేయాలని సూచించారు.పెళ్లి చేసుకొని అత్తారింట్లో హాయిగా కాపురం చేయాల్సిన కూతురు పెళ్లి పెళ్లి పీటల మీద ఆగిపోవడంతో యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు