టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన సెకండ్ ఇన్నింగ్ లో నటుడుగా అవతారం ఎత్తాడు.సౌత్ లో తమిళ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్యల దర్శకత్వంలో అతడు హీరోగా రూపొందుతున్న చిత్రం ఫ్రెండ్ షిప్.ఈ సినిమాలో హీరోయిన్ గా బిగ్ బాస్ ఫేం లోస్లియా నటిస్తుంది.
ఇక యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు.
ఈ చిత్రాన్ని జేపీఆర్, స్టాలిన్‌లు నిర్మిస్తున్నారు.
ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.బ్యాగ్రౌండ్లో లైబ్రరీ హాల్‌ను చూపిస్తూ హర్భజన్, అర్జున్‌లతో పాటు లోస్లియా లుక్ కూడా రివీల్ చేశారు.
ఈ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.ఇక ఈ సినిమాని హర్భజన్ సింగ్ కి ఉన్న క్రేజ్ నేపధ్యంలో పాన్ ఇండియా రేంజ్ సినిమాగా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే శ్రీశాంత్ క్రికెటర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు.
ఇప్పుడు హర్భజన్ సింగ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.మరి నటుడుగా అతను ఎంత వరకు తనని తాను ప్రూవ్ చేసుకుంటాడు అనేది వేచి చూడాలి.