భారత్ లో కూడా ఆందోళన కలిగిస్తున్న కరోనా,4 వేలకు పైగా మరణాలు

గత కొద్దీ రోజులుగా భారత్ లో కూడా కరోనా కేసులు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి.

గడచిన నాలుగు రోజులుగా దేశంలో 6 వేలకు తగ్గకుండా కరోనా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో(ఒక్క రోజులోనే) కొత్తగా 6,977 మంది వైరస్ కేసులు నమోదు అయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,845 కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

అంతేకాకుండా 154 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోవడం తో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,021కి పెరిగింది.దేశంలలో మొత్తం కేసుల్లో ఇప్పటి వరకు 57,720 మంది వ్యాధి నుంచి కోలుకోగా, మరో 77,103 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు విషయంలో భారత్ ఇరాన్‌ను దాటేసి టాప్ టెన్ లిస్టులోకి చేరిపోయినట్లు తెలుస్తుంది.ఇరాన్‌లో ఇప్పటి వరకు 135,701 కేసులు నమోదు కాగా భారత్‌లో 138,845 కేసులు నమోదయ్యాయి.

Advertisement

మరోవైపు దేశంలో మహారాష్ట్ర అత్యధిక కేసులతో మొదటి స్థానంలో ఉండగా.తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలు ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పిటికి కరోనా మాత్రం దేశవ్యాప్తంగా విజృంభిస్తూనే ఉంది.మహారాష్ట్ర లో కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం తో కేరళ నుంచి వైద్య సిబ్బందిని కూడా రప్పించేపనిలో పడ్డారు.

మరోపక్క కోయంబేడు లింకులతో తమిళనాడులో కూడా కరోనా రక్కసి తీవ్రంగా వ్యాపిస్తోంది.ప్ర‌స్తుతం దేశంలో మ‌హారాష్ట్ర అత్యధికంగా 50 వేలు పైచిలుకు కేసులతో మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు 16,277 పాజిటివ్ కేసులు, 111 మరణాలతో రెండో స్థానంలోకి చేరింది.

మొన్న‌టి వ‌ర‌కు గుజ‌రాత్ అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో రెండో స్థానంలో ఉండ‌గా, ఇప్పుడు త‌మిళ‌నాడు గుజ‌రాత్ స్థానాన్ని ఆక్ర‌మించేయడం తో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది.అటు గుజ‌రాత్‌లోనూ కోవిడ్‌-19 భూతం జ‌డ‌లు విప్పుకుంటోంది.ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 14,056 పాజిటివ్ కేసులు నమోదు కాగా.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

వైరస్ కారణంగా 858 మంది ప్రాణాలు విడిచారు.దేశ రాజధాని ఢిల్లీలో అయితే కరోనా విలయం సృష్టిస్తోంది.

Advertisement

అక్కడ 13,418 పాజిటివ్ కేసులు 261 మరణాలు సంభవించినట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు