ప్రపంచానికే గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సుదీర్ఘ సమయం సాగిన ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించినట్లుగా సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

రాత్రి 10 గంటల సమయంలో కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేశారు.లాక్‌డౌన్‌ను ఈనెల చివరి వరకు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్న కేసీఆర్‌ హైదరాబాద్‌లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలకు సంబంధించిన విషయాలను కూడా వివరించారు.

ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ ప్రపంచానికే గుడ్‌ న్యూస్‌ చెప్పారు.తెలంగాణలోని జోనోమ్‌ వ్యాలీలోని ఔషద సంస్థలు కరోనాకు వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.

వారి కృషి ఫలిస్తే ఆగస్టు లేదా సెప్టెంబర్‌ వరకు వ్యాక్సిన్‌ వస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు.తెలంగాణలో ఆ వ్యాక్సిన్‌ వస్తే మన దేశానికే కాకుండా ప్రపంచానికే మనం మార్గం చూపిన వాళ్లం అవుతామన్నారు.

Advertisement

రాష్ట్రంలో ప్రముఖ బయోలాజికల్‌ కంపెనీల ప్రతినిధులతో తాను మాట్లాడాను. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ పైనే వారి పూర్తి దృష్టి పెట్టినట్లుగా నాతో చెప్పారు.

కరోనా వైరస్‌కు త్వరగా వ్యాక్సిన్‌ కనిపెట్టబడాలని ప్రతి ఒక్కరం దేవుడిని కోరుకుందాం అన్నాడు.

Advertisement

తాజా వార్తలు