అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌తో సినిమా స్థాయి అమాంతం పెరిగింది.
సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.
అందుకే ఇతర భాషలకు చెందిన నటీనటులను ఈ చిత్రంలో నటింపజేస్తున్నారు.
తమిళం నుండి విజయ్ సేతుపతిని ఈ చిత్రం కోసం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక విలన్ పాత్రకు గాను బాలీవుడ్ నుండి సంజయ్ దత్ లేదా సునీల్ శెట్టిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కన్నడం నుండి స్టార్ నటుడు దాలి దనంజయ్‌ను కీలక పాత్ర కోసం ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈయన గతంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ప్రస్తుతం ఈయన్ను గుర్తు పట్టక పోవచ్చు కాని ఆయన సినిమా పేరు చెబితే వెంటనే గుర్తు పట్టేస్తారు.

రామ్ గోపాల్ వర్మ తీసిన భైరవ గీత చిత్రం ద్వారా ఈయన తెలుగు వారి ముందుకు వచ్చాడు.కన్నడంలో మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకోవడంతో పాటు ఎన్నో సినిమాలతో సక్సెస్‌లు కూడా దక్కించుకున్నాడు. అందుకే ఈయన్ను తెలుగులో పుష్ప చిత్రం కోసం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.అయితే అతడు విలన్‌గా నటించబోతున్నాడా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించబోతున్నాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.