పవన్‌తో పాటు మహేష్‌ను కూడా లైన్‌లో పెడతాడట!

కమర్షియల్ సినిమాలను తెరకెక్కిస్తూ వాటిని బ్లాక్‌బస్టర్‌లుగా మలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందించిన హరీష్, మరోసారి పవన్‌తో కలిసి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న పవన్, హరీష్ శంకర్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో పవన్ కోసం ఓ అదిరిపోయే కథను రాస్తున్నాడట ఈ డైరెక్టర్.

అదే సమయంలో తనకు ఎప్పటినుండో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉందని, దాని కోసం కూడా ఓ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను రాస్తున్నట్లు హరీష్ శంకర్ తెలిపాడు.ఇటు పవన్ సినిమా తరువాత తన కథను మహేష్‌కు వినిపిస్తానని, ఆయన ఓకే అన్న వెంటనే సినిమాను పట్టాలెక్కిస్తానని ధీమాగా చెబుతున్నాడు ఈ డైరెక్టర్.

మరి పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? ఆ సినిమా రిజల్ట్ తరువాత మహేష్ హరీష్‌తో సినిమా చేసేందుకు ఒప్పుకుంటాడా అనేది కాలమే చెబుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement
అందుకే నేను ఏ రోజు సొంత పిల్లల గురించి ఆలోచించ లేదు : రాజమౌళి

తాజా వార్తలు