ఏపీ లో జగన సర్కార్ కు హైకోర్టు మరో ఝలక్ ఇచ్చింది.ఇప్పటికే సర్కార్ బడుల్లో ఇంగ్లీషే మీడియం ఖచ్చితం చేస్తూ తీసుకువచ్చిన 81,85 జీవోలను రద్దు చేస్తూ ఇటీవల తీర్పు వెల్లడించిన హైకోర్టు తాజాగా పంచాయతీ ఆఫీసులకు వైసీపీ రంగుల విషయంలో గడువు ఇచ్చే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పింది.
ఏపీ లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ ఆఫీసులకు వైసీపీ రంగులు వేసిన విషయంగా గతంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాటిని తొలగించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగుల్ని తొలగించేందుకు జగన్ సర్కార్ మూడు నెలల గడువు కోరుతూ పిటీషన్ దాఖలు చేయగా అందుకు హైకోర్టు గడువు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
ఒక వేళ గడువు ఇస్తే స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా ఉంటారా? అని ప్రభుత్వాన్ని ఎదురు ప్రశ్నించింది. స్థానిక ఎన్నికలు పూర్తయ్యేదాకా రంగులు అలాగే ఉంచాలన్న కారణంతో గడువు కోరుతున్నట్లుగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
దీంతో.లాక్‌డౌన్ ముగిశాక కొత్త రంగులేయడానికి ఎంత సమయం పడుతుందో అధికారుల నుంచి సమాచారం తీసుకోని కోర్టుకు వెల్లడిస్తామని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దీనితో ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.