కొడుక్కి హీరో పాత్ర పేరు పెట్టుకున్న దర్శకుడు

టాలీవుడ్ లో వరుసగా కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటూ స్టార్ దర్శకుడు కేటగిరీలోకి వచ్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇప్పటి వరకు కెరియర్ లో ఫ్లాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న దర్శకుల జాబితాలో రాజమౌళి, కొరటాల తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి ఉన్నాడు.

ఇప్పటి వరకు చేసిన జోనర్ లో మరోసారి సినిమా చేయకుండా ప్రతి సినిమాలో ఒక కొత్త కమర్షియల్ పాయింట్ తో సినిమా చేస్తూ వస్తున్న అనిల్ రావిపూడి తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు వంద కోట్ల క్లబ్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు.ఈ సినిమాతో స్టార్ దర్శకుడుగా కూడా మారిపోయాడు.

ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ టైంలోనే అనిల్ రావిపూడికి కొడుకు పుట్టాడు.తాజాగా తన కొడుకుకి సరిలేరు సినిమాలో హీరో పాత్ర పేరు అయిన అజయ్ కృష్ణలో అజయ్ అనే పేరుని పెట్టినట్లు తెలిపాడు.

సినిమాలో కూడా ఆ పేరు మీద ఇష్టంతో తాను మహేష్ బాబు పాత్రకి పెట్టానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ఇక ప్రస్తుతం ఎఫ్3కి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నానని, దీనిని పూర్తి చేసిన వెంటనే హీరోలని ఒకే చేసుకొని సెట్స్ పైకి వెళ్ళిపోతా అని అనిల్ రావిపూడి చెప్పడం విశేషం.

Advertisement

దీనిని బట్టి ఎఫ్3 సినిమా తర్వాతనే అనిల్ వేరొక స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు