జాను దెబ్బకి కొత్త రీమేక్ జోలికి వెళ్ళని దిల్ రాజు

తమిళంలో సూపర్ హిట్ అయిన 96 సినిమాని చూసిన దిల్ రాజు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి ఇలాంటి మంచి సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేసి క్యాష్ చేసుకోవాలని అనుకున్నాడు.

అనుకున్నదే తడువుగా సినిమా రీమేక్ రైట్స్ కొనేసి సమంత, శర్వానంద్ జోడీగా ఒరిజినల్ దర్శకుడుతోనే జాను టైటిల్ తో సినిమా తీశాడు.

అయితే సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఉన్న కూడా అది కాస్తా జెనరేషన్ గ్యాప్ వలన వర్క్ అవుట్ కాలేదు.తెలుగులో దారుణంగా డిజాస్టర్ అయ్యింది.

ఇక ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాజుగారికి రాలేదు.అయితే ప్రస్తుతం పింక్ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ గా రీమేక్ చేస్తున్నారు.

ఇది కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.అయితే కెరియర్ లో ఇప్పటి వరకు రీమేక్ జోలికి వెళ్ళని దిల్ రాజు జాను, పింక్ లపై మనసు పడ్డాడు.

Advertisement

వీటితో పాటు హిందీ బదాయి హో అనే సినిమాని కూడా రీమేక్ చేయాలని భావించాడు.అయితే జాను సినిమా రిజల్ట్ తేడా కొట్టడం, పింక్ ఇంకా రిలీజ్ కాకపోవడంతో మరో సారి రిస్క్ చేయకూడదని ఆ హిందీ రీమేక్ ని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.

వకీల్ సాబ్ రీమేక్ తర్వాత వచ్చే సక్సెస్ పట్టి బదాయి హోని తెరకెక్కించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు