అమెరికాలోని భారతీయులకి గుడ్ న్యూస్...!!!

కరోనా వైరస్ అమెరికాలో అతిపెద్ద విలయం సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.ఈ మహమ్మారిని తరిమేయడానికి అమెరికా విశ్వప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలోనే షట్ డౌన్ పాటించాలని చెప్పడంతో పాటుగా యూనివర్సిటీలు , కాలేజీలు, స్కూల్స్ , హాస్టల్స్ , పర్యాటక ప్రదేశాలు ఇలా ప్రతీ ఒక్క ప్రాంతాన్ని మూసేయించింది.విమానయాన సర్వీసులని కూడా రద్దు చేసింది.

ఈ క్రమంలో ఎంతో మంది పర్యాటకులు అమెరికాలోనే చిక్కుకుపోయారు.అదే సమయంలో భారత్ సైతం అంతర్జాతీయ విమాన సర్వీసులని రద్దు చేయడంతో అమెరికాలో భారత పర్యాటకులు చిక్కుకుపోయారు.

అయితే అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకి అమెరికా ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం భారతీయులకి మాత్రమే కాకుండా పర్యాటక వీసాలు తీసుకుని అమెరికా వచ్చిన వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

Advertisement

పర్యాటక వీసాపై తమ దేశం వచ్చిన వారిలలో గడువు పూర్తయిన వారు యునైటెడ్ స్టేట్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ కి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు.

ఇలా దరఖాస్తులు చేసుకున్న వారి పత్రాలని పరిశీలించి వీసా గడువులు పొడిగిస్తామని ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు.మరోవైపు హెచ్-1 బీ వీసా గడువు ముగిసిన వారు ఎంతో మంది ఉన్నారు.అమెరికా నిభంధనల ప్రకారం హెచ్-1 బీ వీసా గడువు పూర్తయితే వారు అమెరికాలో ఉన్నా అక్రమంగా ఉన్నట్టుగానే లెక్క గడుతారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హెచ్-1 బీ గడువు ముగిసినా వారికి కొంత కాలం పాటు ఇక్కడ ఉండే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు