న్యూస్ పేపర్లు చదివే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.ఒకవైపు ముద్రణ భారం, సిబ్బంది జీత భత్యాలు, తగ్గిపోతున్న పాఠకుల ఆదరణ ఇలా ఎన్నో ఇబ్బందికర పరిణామాలను పత్రికలు ఎదుర్కొంటున్నాయి.
సరిగ్గా ఇదే సమయంలో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించడం, ఆ ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడింది.ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలయిపోతోంది.
ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తున్నాయి.ఇక మనదేశంలోనే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు వచ్చే నెల 14 వ తేదీ వరకు లాక్ డౌన్ విధించి పగడ్బంధీ ఏర్పాట్లు చేశారు.
ఇదే సమయంలో కరోనా వైరస్ కు సంబంధించి వార్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి.సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా ఇలా అన్ని చోట్లా పెద్ద ఎత్తున రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి.
పత్రికల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలవ్వడంతో పత్రికలు కొనేందుకు జనాలు వెనకడుగు వేస్తుండడం, పత్రికల ముద్రణ తరువాత వాటిని పంపిణీ చేసేందుకు పేపర్ బాయ్స్ వెనకడుగు వేస్తుండడంతో పత్రికల ముద్రణ నిలిపివేయాలని పత్రికల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి.అయితే ఒక్కసారి పత్రికల ముద్రణకు విరామం ప్రకటిస్తే ఆ తరువాత పాఠకుల ఆదరణ పొందడం కష్టం అవుతుంది అన్న ఆందోళన పత్రికల యాజమాన్యాలలో ఎక్కువయింది.
సరిగ్గా ఇదే విషయమై ఇప్పుడు కేంద్రం కూడా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టాలని చూస్తోంది.పత్రికల ద్వారా అయితే విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేసే వీలు ఉంటుంది అన్న ఆలోచనకు కేంద్రం వచ్చింది.
దీనిలో భాగంగానే న్యూస్ పేపర్ల ముద్రణకు, మారే ఇతర విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ పంపించినట్టు సమాచారం.కేంద్ర ప్రభుత్వం దినపత్రికలను కాపాడేందుకు ప్రత్యేకమైన చొరవ తీసుకునేందుకు దినపత్రికల యాజమాన్యాలు కూడా మనసు మార్చుకున్నాయి.
అయితే ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు వారికి కష్టమే కాబట్టి.కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీనిలో భాగంగానే జిల్లా టాబ్లాయిడ్లను నిలిపివేస్తున్నారు.వాటిని మెయిన్ పేజీలోనే భాగం చేసి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
కరోనా భయంతో ప్రజలు పేపర్లను కొనేందుకు కూడా వారు సిద్ధపడటం లేదు.ఈ భయాలను ప్రజల్లో తొలగించేందుకు ఇప్పటికే అవేర్ క్యాంపైన్లను ఆయా సంస్థలు ప్రారంభించాయి.
చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దినపత్రికల వల్ల కరోనా రాదని ప్రకటన విడుదల చేసింది.







