పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది.ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న పవన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అప్పుడే అంచనాలు వేస్తున్నారు.
పవన్ తొలిసారి లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు మెగా బ్రదర్ నాగబాబును రికమెండ్ చేశాడట పవన్.
ఈ సినిమాలోని ఆ కీలక పాత్రను మంచి పట్టున్న నటుడితో చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తుండగా, అందుకు నాగబాబు అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతాడని పవన్ అన్నాడట.దీంతో చిత్ర యూనిట్ వెంటనే నాగబాబును ఈ విషయమై కలిసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో నటించేందుకు నాగబాబు ఓకే చెప్పాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.ఇక పవన్ హీరోగా నటిస్తు్న్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.







