నాని 25వ చిత్రంగా రూపొందిన ‘వి’ చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేయాలనుకున్న విషయం తెల్సిందే.షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోబోతుంది.
ఒకటి రెండు రోజుల్లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
దిల్‌రాజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం సరైన నిర్ణయం కాదని భావిస్తున్నాడట.
కరోనా కారణంగా పలు ప్రాంతాల్లో థియేటర్ల బంద్ కొనసాగుతుంది.మరో వైపు ఓపెన్ ఉన్న థియేటర్ల వద్దకు కూడా జనాు రావడం లేదు.
ఆ కారణంగానే వి సినిమాను వాయిదా వేయడం మంచిదని అంతా అనుకుంటున్నారు.కేవలం వి మాత్రమే కాకుండా ఇంకా పలు చిత్రాలు కూడా వాయిదాలు పడబోతున్నట్లుగా దీన్ని బట్టి తెలుస్తోంది.

తెలంగాణలో కరోనా బాధితులు మెల్ల మెల్లగా పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లను బంద్ చేయాలనే నిర్ణయానికి వస్తున్నారు.ఏపీలో ఇప్పటికే నెల్లూరు జిల్లాలో థియేటర్ల బంద్ కొనసాగుతుంది.ఇదే సమయంలో తెలంగాణలో కూడా థియేటర్లను బంద్ చేస్తే సినిమాల విడుదల అంతా కూడా వాయిదా పడే అవకాశం ఉంది.సమ్మర్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పలు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.
ఇలాంటి సమయంలో కరోనా వైరస్ కారణంగా అంతా అల్ల కల్లోలం అవుతుంది.







