నాతో కూడా కుక్క చాకిరి చేయించుకున్నారని అంటున్న సీనియర్ నటి...

మాటల మాంత్రికుడు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన టువంటి నువ్వే నువ్వే చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది.

ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా తరుణ్, శ్రీయ శరన్ నటించారు.

అయితే ఈ చిత్రంలో శ్రీయ శరణ్ వదిన పాత్రలో నటించిన టువంటి యాంకర్ మరియు సీనియర్ ఆర్టిస్ట్ అనిత చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే దాదాపుగా తెలుగులోని అందరి స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసింది.

తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.ఇందులో భాగంగా ప్రస్తుతం టాలీవుడ్ లో కుల పిచ్చి బాగా ఉందని అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించింది.

సినీ పరిశ్రమలో తమ కులం గురించి గానీ లేదా తమ పేరు పక్కన పెట్టుకున్నటువంటి కులం పేరు చూసి గాని ఎవరూ అవకాశాలు ఇవ్వరని కేవలం తమ టాలెంట్ ను బట్టి మాత్రమే అవకాశాలు ఇస్తారని చెప్పుకొచ్చింది.అంతేగాక తాను చౌదరి కులానికి చెందిన మహిళని అని తెలిపారు.

Advertisement

అలాగని తనకేమీ అవకాశాలు తమంతట తామే రాలేదని తాను కూడా పలు చిత్రాలకు ఆడిషన్స్ లో పాల్గొన్నానని, అంతేగాక తనతో కూడా కుక్క చాకిరి చేయించుకునేవాళ్లని చెప్పుకొచ్చింది.కాబట్టి ఇప్పటి తరం నూతన నటీనటులకు కష్టపడి పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని తమ కులాలు, రెకమెండేషన్ వల్ల వచ్చినటువంటి అవకాశాలు ఎక్కువ కాలం నిలబడవని కాబట్టి టాలెంట్ ని నమ్ము కోవాలని సూచించారు.

అయితే టాలీవుడ్ లో తనకు ఒకప్పటి యాంకర్లు అయినటువంటి ఉదయభాను, ఝాన్సీ వంటివారు మంచి స్నేహితులని, కానీ ఈ మధ్య కాలంలో బిజీగా ఉండటంవల్ల వారిని చాలా మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది అనితా చౌదరి. .

Advertisement

తాజా వార్తలు