యాక్షన్ చిత్రాలకు ఒకప్పుడు బ్రాండ్ అంబాసిడర్‌గా వివి వినాయక్ వెలుగు వెలిగిన విషయం తెల్సిందే.ఇండస్ట్రీ టాప్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వినాయక్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు.
గతంలో స్టార్ హీరోలకు అద్బుతమైన సక్సెస్‌లను ఇచ్చిన ఈయన ప్రస్తుతం వరుసగా ఫ్లాప్‌ల కారణంగా అసలు ఆఫర్లు లేక బిత్తర చూపులు చూస్తున్నాడు.గతంలో పలు సినిమాలు చేసిన వినాయక్‌కు ఒక్క ఛాన్స్ రావడం గగనం అయ్యింది.

ఖైదీ నెం.150 చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్న వినాయక్ ఇప్పుడు హీరోగా ఒక చిత్రంలో నటిస్తున్నాడు.ఒక వైపు నటిస్తూనే మరో వైపు దర్శకుడిగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు.పలు కథలను పట్టుకుని సీనియర్స్ నుండి జూనియర్స్ వరకు ఎంతో మందిని సంప్రదించినా కూడా ఏ ఒక్కరు ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదని సమాచారం అందుతోంది.
కథలు బాగానే ఉన్నాయని చెప్పినా కూడా వినాయక్‌పై మాత్రం వారికి నమ్మకం కలగడం లేదు అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

వినాయక్ తాజాగా మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసీఫర్ రీమేక్ కు డైరెక్షన్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.చిరంజీవి 153వ చిత్రంగా ఈ రీమేక్ తెరకెక్కబోతుంది.వరుసగా రీమేక్‌లను చేస్తున్న వినాయక్ సొంత స్టోరీతో మాత్రం సినిమా చేస్తే నిరాశ పర్చుతున్నాడు.
అందుకే ఇకపై వినాయక్‌కు రీమేక్ ఛాన్స్‌లు మాత్రమే వస్తాయని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.రీమేక్‌లతో కెరీర్‌ను ఈయన నెట్టుకు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







