మాస్ రాజాను రికమెండ్ చేసిన నేచురల్ స్టార్

మాస్ మహారాజా రవితేజ ఇటీవల డిస్కో రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్కబోర్లా పడ్డాడు.

ఈ సినిమాలో దమ్ము లేకపోవడంతో రవితేజ కెరీర్‌లో మరో అట్టర్‌ఫ్లాప్ మూవీ వచ్చి పడింది.

ఇక ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో క్రాక్ అనే సినిమాలో నటిస్తున్నాడు రవితేజ.ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే తన నెక్ట్స్ మూవీని కూడా ఓకే చేశాడు.

దర్శకుడు త్రినాధరావు డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని చేయడానికి రవితేజ రెడీ అవుతున్నాడు.గతంలో నేచురల్ స్టార్ నానితో కలిసి ‘నేను లోకల్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన త్రినాథ రావు, మరో అదిరిపోయే కామెడీ కథను నానికి వినిపించాడట.

అయితే ఆ కథ తనకంటే కూడా మాస్ రాజా రవితేజకు బాగా సూట్ అవుతుందని నాని అన్నాడట.దీంతో త్రినాథరావు తన కథను రవితేజకు వినిపించగా, మాస్‌రాజా ఆ కథకు బాగా ఇంప్రెస్ అయ్యాడట.

Advertisement

వెంటనే ఈ సినిమా చేసేందుకు పచ్చ జెండా కూడా ఊపేశాడు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు దర్శకనిర్మాతలు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అవుతున్నారు.మరి నాని రికమెండ్ చేసిన ఈ కథ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు