లోకేష్ కొడుకు దేవాన్ష్ ఎంత పనిచేసాడో తెలుసా ? బాబు బాలయ్య బుక్కైపోయారుగా ?

కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ కుటుంబ సభ్యుల ఆసక్తులను గొప్పగా ప్రకటించాడు.ఒక వైపు ఐటీ దాడులు చంద్రబాబే లక్ష్యంగా ఏపీలో జరుగుతుంటే లోకేష్ హడావుడిగా ఆస్తుల ప్రకటన చేయడంపై అందరూ ఆశ్చర్యపోయారు.

 Heritage Properties Transfer To Chandrababu And Balakrishna-TeluguStop.com

ఆ టాపిక్ నుంచి జనాలను డైవర్ట్ చేయడానికే లోకేష్ ఇలా హడావుడి ప్రకటనలు చేసినట్టు ప్రచారం జరిగింది.ఇక లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం చూసుకుంటే గతేడాది కంటే ఈ ఏడాది బాగా ఆస్తులు పెరిగినట్లుగా లోకేష్ లెక్కలు కనిపించాయి.

అయితే ఈ వ్యవహారంలో నందమూరి బాలకృష్ణ కూడా అడ్డంగా బుక్కైనట్టుగా కనిపిస్తున్నాడు.గతంలో చాలాసార్లు చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించినప్పుడు ఎప్పుడూ బాలయ్య ప్రస్తావన రాలేదు.

కానీ ఈ సారి లోకేష్ విడుదల చేసిన ఆస్తుల జాబితాలో బాలయ్య చేరిపోయాడు.

Telugu Ap, Lokesh Devansh, Tdp Chandrababu, Ycp Ap-Political

అది ఎలా అంటే తన కుమారుడు దేవాన్స్ పేరిట భారీగా ఆస్తులు పెరిగినట్లుగా లోకేష్ ప్రకటించారు.వాటికి కారణాలు కూడా వివరించాడు.దేవాన్స్ కు వాళ్ళ తాత నుంచి హెరిటేజ్ షేర్లు బదిలీ అయినట్లు లోకేష్ ప్రకటించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా గతంలో చాలాసార్లు హెరిటేజ్ కు నాకు సంబంధం లేదు అంటూ చంద్రబాబు ప్రకటించారు.వాటిలో ఉన్న షేర్ల ను అమ్మేసాను అంటూ చెబుతూ వచ్చారు.

దీనిపై అసెంబ్లీలో రాద్ధాంతం కూడా జరిగింది.కానీ ఇప్పుడు మనవడికి హెరిటేజ్ షేర్ లు ఇచ్చినట్టుగా లోకేష్ ప్రకటించడంతో చంద్రబాబు చిక్కుల్లో పడ్డారు.

Telugu Ap, Lokesh Devansh, Tdp Chandrababu, Ycp Ap-Political

దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు అనుకూల మీడియా దీనిపై కథనాలు ప్రచారం చేస్తూ తాత అంటే చంద్రబాబు ఒక్కరే కాదు బాలయ్య కూడా తాతే ఆయనే హెరిటేజ్ షేర్లు మనవడికి ఇచ్చారు అన్నట్టుగా కథనాలు రాశాయి.ఒకవేళ నిజంగానే బాలయ్య వాటిని మనవడికి ఇచ్చినా వాటి గురించి ఎన్నికల అఫిడవిట్ లో బాలయ్య వాటి గురించి పేర్కొనలేదు.దీంతో ఇప్పుడు లోకేష్ ప్రకటించిన ఆస్తులు వివరాల ప్రకారం చంద్రబాబు గాని, బాలయ్య గాని అందులో ఇరుక్కునే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube