యూఏఈలో భారతీయుడికి కరోనా: ప్రత్యేక వార్డుకు తరలింపు

చైనాలో పుట్టిన కరనో వైరస్ ప్రస్తుతం ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే.

దీని వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా విజృంభిస్తూనే ఉంది.

తాజాగా యూఏఈలో ఓ ప్రవాస భారతీయుడికి కరోనా నిర్థారణ అయ్యింది.దీంతో ఆ దేశంలో కరోనా బాధితుల సంఖ్య 8కి చేరింది.

కరోనా లక్షణాలున్న వ్యక్తితో మాట్లాడిన తర్వాత భారతీయుడికి వ్యాధి సోకినట్లు యూఏఈ ఆరోగ్య, నివారణ శాఖ సోమవారం ప్రకటించింది.వీరందరికి అందుబాటులో ఉన్న నాణ్యమైన ఆరోగ్య కేంద్రాలలో చికిత్స అందిస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

‌దుబాయ్‌లో సెలవు దినాలను గడిపేందుకు వుహాన్ నుంచి వచ్చిన నలుగురికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది.ఐదవ రోగి కూడా చైనా నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది.

Advertisement

చైనాలో పుట్టిన కరోనా ప్రస్తుతం హాంకాంగ్, థాయ్‌లాండ్, భారత్, జర్మనీ, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, బెల్జియం, స్వీడన్, ఫిన్‌లాండ్, అమెరికా, స్పెయిన్ వంటి దేశాలకు విస్తరించింది.చైనాలో కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారం నాటికి 1000కి చేరింది.ఒక్క హుబే ప్రావిన్స్‌లోనే 103 మంది ప్రాణాలు కోల్పోయారు.

అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం 42 వేల మంది కరోనాతో బాధపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు