అమెరికాలో తానా సంక్రాంతి సంబారాలు అదరహో..

అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) అంటే తెలియని వాళ్ళు ఉండరు.

ముఖ్యంగా ప్రతీ తెలుగు వారికి తానా అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది.

తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలని గౌరవించడంలో దేశం కాని దేశంలో అచ్చ తెలుగు లోగిళ్ళలో పండుగలు జరుగుతున్నట్టుగా రూపొందించడంలో తానా రూటే సపరేటు అని చెప్పాలి.తాజాగా హారీస్ బర్గ్ లో తానా చేపట్టిన సంక్రాంతి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ వేడుకలకి భారీ ఎత్తున హాజరయిన తెలుగు వారు ఎంతో ఉల్లాసంగా సరదాగా గడిపారు.సుమారు 200 మందికి పైగా తమ నైపుణ్యంతో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.

క్లాసికల్ డ్యాన్స్, ఫ్యాషన్ షో, మ్యూజికల్ నైట్, సంగీత విభావరి ఇలా ఎన్నో అలరించే కార్యక్రమాలు చేపట్టారు.ఈ వేడుకలకి వచ్చిన సుమారు 1500 మంది తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడిన అధ్యక్షుడు జే తాళ్ళూరి ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.

Advertisement

పెన్సిల్వేనియా లోని మెకానిక్ బర్గ్ వాలీ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో తానా హారీస్ బర్గ్ టీమ్ ఈ వేడుకలని ఏర్పాటు చేసింది.దాదాపు 200 మంది చిన్నారులు, తెలుగు పద్యాలు, పాటలు, తెలుగు సంస్కృతికి తగ్గట్టుగా కార్యక్రమాలు నిర్వహణ, ముగ్గులు పోటీలు ఇలా ప్రతీ ఒక్క కార్యక్రమం ఆహుతులని కట్టిపడేలా చేసింది.చివరిలో తానా ఏర్పాటు చేసిన తెలుగు వంటలని ఆస్వాదించిన తెలుగు వారు తానా చేపట్టిన ఈ కార్యక్రమానికి కృతజ్ఞతలు తెలిపారు.

మా అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం.. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో తీర్మానం
Advertisement

తాజా వార్తలు