తాజాగా టాలీవుడ్ గ్లామర్ క్వీన్ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇంట్లో ఐటీ దాడులు జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే.దీంతో తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కసారిగా రష్మిక మందన్న గురించి పలు రకాలుగా గుసగుసలాడుకుంటున్నారు.
అయితే దీనికి కారణం లేకపోలేదు.అందరికీ రష్మిక ఇంట్లో ఐటీ దాడులు జరిగాయని మాత్రమే తెలిసింది కానీ ఐటి దాడులలో ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియదు.
దీంతో తాజాగా రష్మిక మందన్న మేనేజర్ స్పందిస్తూ అసలు ఐటీ దాడులు జరిగింది రష్మిక మందన్న ఆస్తుల వివరాలు గురించి కాదని ఆమె తండ్రి ఆస్తికి సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు తనిఖీలు చేశారని స్పష్టం చేశాడు.అయితే ఇందులో భాగంగా రష్మిక తండ్రి నివాసం ఉంటున్న ఇంటి నుంచి ఐటీ అధికారులు 25 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి పత్రాలు మరియు కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు కూడా అతడు తెలిపాడు.
దీంతో రష్మిక మనపై వస్తున్నటువంటి పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రష్మిక మన నటించినటువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు.సంక్రాంతి కానుకగా విడుదలైన టువంటి ఈ చిత్రం థియేటర్లలో మంచి కాసుల వర్షం కురిపిస్తోంది.అంతేగాక రష్మిక కెరీర్లోనే ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
దీంతో రష్మిక మందన్న ప్రస్తుతం ఈ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేసే పనిలో పడింది.